Chris Gayle: జూనియర్ క్రిస్ గేల్ ఆటచూస్తే అవాక్కవ్వాల్సిందే

క్రిస్ గేల్ ను ( Chris Gayle ) ఒక చిన్నారి క్రికెటర్ ఛాలెంజ్ చేశాడు. ఆ వీడియో వైరల్ ( Viral Video ) అవుతోంది. ఈ వీడియో క్రికెట్ అభిమానులు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో, ఎకౌంట్స్ లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. పవర్ ఫుల్ హిట్టింగ్ అంటే అందరికన్నా ముందు మనకు గుర్తుకు వచ్చే పేరు క్రిస్ గేల్ మాత్రమే. 

Last Updated : Sep 15, 2020, 01:18 PM IST
    • క్రిస్ గేల్ ను ( Chris Gayle ) ఒక చిన్నారి క్రికెటర్ ఛాలెంజ్ చేశాడు.
    • ఆ వీడియో వైరల్ ( Viral Video ) అవుతోంది. ఈ వీడియో క్రికెట్ అభిమానులు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో, ఎకౌంట్స్ లో విపరీతంగా షేర్ చేస్తున్నారు.
Chris Gayle: జూనియర్ క్రిస్ గేల్ ఆటచూస్తే అవాక్కవ్వాల్సిందే

క్రిస్ గేల్ ను ( Chris Gayle ) ఒక చిన్నారి క్రికెటర్ ఛాలెంజ్ చేశాడు. ఆ వీడియో వైరల్ ( Viral Video ) అవుతోంది. ఈ వీడియో క్రికెట్ అభిమానులు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో, ఎకౌంట్స్ లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. పవర్ ఫుల్ హిట్టింగ్ అంటే అందరికన్నా ముందు మనకు గుర్తుకు వచ్చే పేరు క్రిస్ గేల్ మాత్రమే. 

క్రికెట్ అభిమానులకు ఇప్పుడు క్రిస్ గేల్ లాంటి మరో ప్లేయర్ కూడా దొరికాడు. ఈ ప్లేయర్ కూడా భారీ సిక్సులు అలవోకగా కొట్టగలడు. ఇతన్నే చాలా మంది జూనియర్ క్రిస్ గేల్ ( Jr.Chris Gayle ) అంటున్నారు. ఇతను క్రిస్ గేల్ కు ధీటుగా బ్యాటింగ్ చేసేస్తున్నాడు. అతని బ్యాటింగ్ ను చూసి యూనివర్సల్ బాస్ గేల్ కూడా అవాక్కయ్యాడు.

How good is this young kid!!! #talented #aakashvani #feelitreelit #feelkaro

A post shared by Aakash Chopra (@cricketaakash) on

ఈ వీడియోను ( Trending Video ) భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్, కమెంటేటర్ ఆకాశ్ చోప్రా ( Akash Chopra ) తన సోషల్ మీడియా , ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. అక్కడే అందరికి జూనియర్ క్రిస్ గేల్ పరిచయం అయ్యాడు. 

ఈ వీడియోలో ఒక చిన్నారి లెఫ్ట్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేస్తుంటాడు. అది కూడా చివరి మెట్ల  నుంచి భారీ షాట్ కొడతాడు. ముందు బాల్ కోసం వేచి చూసిన చిన్నారి గేల్ బాల్స్ పడగాడే వాటిని క్షణాల్లో బ్యాట్ తో మాయం చేస్తుంటాడు. ఇతను కొట్టే భారీ షాట్స్ ను చూసి చాలా మంది ఆశ్చర్యపడతారు. ఇంత చిన్న కుర్రాడు ఈ లెవల్ లో షాట్స్ కొట్టడం ఏంటి అని ముక్కున వేలేసుకుంటున్నారు. 

Trending News