AUS vs SA : ఆసిస్ లక్ష్యం ఎంతంటే.. ?
ఐసిసి ప్రపంచ కప్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 45వ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది.
లండన్: ఐసిసి ప్రపంచ కప్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 45వ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. సఫారీ ఆటగాళ్లలో కెప్టెన్ డుప్లెసిస్ 94 బంతుల్లో 100 పరుగులు (7x4, 2x6) సెంచరీతో రాణించాడు. వాండర్ డుస్సెన్ 97 బంతుల్లో 95 పరుగులు (4x4, 4x6), క్వింటన్ డికాక్ 51 బంతుల్లో 52 పరుగులు (7x4)లతో జట్టు స్కోర్ పెంచడంలో తన వంతు పాత్ర పోషించారు.
ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లయన్‌లు చెరో 2 వికెట్లు తీయగా, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, ప్యాట్ కమ్మిన్స్‌లకు చెరొక వికెట్ దక్కింది. సఫారీలు విధించిన భారీ లక్ష్యాన్ని కంగారులు ఛేదిస్తారో లేదో వేచిచూడాల్సిందే మరి.