World Cup 2023: వరల్డ్ కప్ టీమ్ ప్రకటన.. వెంటనే స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్
Quinton De Kock Retirement: వరల్డ్ కప్ టీమ్‌ను దక్షిణాఫ్రికా బోర్డు ప్రకటించిన వెంటనే క్వింటన్ డికాక్ షాకింగ్ ప్రకటన చేశాడు. ప్రపంచ కప్ తరువాత వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే టెస్టుల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
Quinton De Kock Retirement: సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డికాక్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. భారత్ వేదిక జరిగే ప్రపంచకప్ అనంతరం వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. మంగళవారం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వరల్డ్ కప్‌కు టీమ్‌ను ప్రకటించింది. ఇందులో డికాక్‌కు కూడా చోటు దక్కించుకున్నాడు. అయితే జట్టు పేర్లు ప్రకటించిన వెంటనే రిటైర్మెంట్ నిర్ణయం వెల్లడించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన నిర్ణయంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు పెద్ద షాక్ ఇచ్చాడు.
ఇప్పటికే 2021 సంవత్సరంలో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డికాక్.. ప్రస్తుతం వన్డేలు, టీ20లు ఆడుతున్నాడు. ఇక ప్రపంచకప్ తరువాత టీ20లతోపాటు ఇతర లీగ్‌ల్లో మాత్రమే పాల్గొనున్నాడు. క్వింటన్ డి కాక్ వన్డే కెరీర్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాకు 140 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 44.86 సగటుతో 5966 పరుగులు చేశాడు. 17 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2014లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మొత్తం 54 టెస్టుల్లో 38.82 సగటుతో 3300 పరుగులు చేశాడు. ఆరు సెంచరీలు, 22 అర్ధ సెంచరీలు చేశాడు.
ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ప్రకటించారు. టెంబా బవుమా కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. తొలిసారి 8 మంది ఆటగాళ్లు వరల్డ్ కప్ ఆడుతుండడం విశేషం. సఫారీ సమతూకంగా కనిపిస్తోంది. డేవిడ్ మిల్లర్, మార్‌క్రమ్, క్లాసెన్, రీజా హెండ్రిక్స్, క్వింటన్ డికాక్, బవుమా వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. కగిసో రబాడా, ఎన్రిచ్ నోకియా, లుంగి ఎంగిడి, గెరాల్డ్ కోయెట్జీ వంటి స్టార్ బౌలర్లలో ప్రత్యర్థులకు సవాల్ విసిరుతోంది. ఇక స్పిన్నర్లుగా కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షంసి భారత్ సత్తా చాటేందుకు రెడీగా ఉన్నారు.
వరల్డ్ కప్‌కు టీమిండియా: టెంబా బావుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిక్ క్లాసెన్ (వికెట్ కీపర్), సిసంద మగల, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోకియా, కగిసో రబడా, తబ్రేజ్ షంసీ, రాసీ వాండెర్ డసెన్.
Also Read: India World Cup 2023 Squad: సస్పెన్స్ వీడింది.. ప్రపంచ కప్‌కు భారత జట్టు ప్రకటన
Also Read: RBI UPI Payments: యూపీఐ యూజర్లకు ఆర్‌బీఐ మరో గుడ్‌న్యూస్.. ఇది కదా అసలు కిక్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook