Klaasen retires from Test cricket: దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌(Heinrich Klaasen) టెస్టు ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు. 2019లో భారత్‌పై టెస్టు అరంగేట్రం చేసిన 32 ఏళ్ల క్లాసెన్‌ దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున 4 టెస్టుల్లో 13 సగటుతో 104 పరుగులు మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియాపై చేసిన 35 పరుగులే అతని అత్యుత్తమ స్కోరు. గతేడాది మార్చిలో జొహానెస్‌బర్గ్‌లో వెస్టిండీస్‌తో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఈ ఏడాది భారత్‌తో జరిగిన న్యూ ఇయర్ టెస్ట్‌తో డీన్ ఎల్గర్ టెస్ట్ కెరీర్ వీడ్కోలు పలికిన తర్వాత అదే ఫార్మాట్ నుండి మరో ఆటగాడు రిటైర్ కావడం సఫారీ జట్టుగు గట్టిదెబ్బనే చెప్పాలి. వన్డేలు, టీ20లకు అందుబాటులో ఉండనున్నట్లు ఈ స్టార్ క్రికెటర్ చెప్పాడు. ఇది ఎంతో కఠినమైన నిర్ణయమని.. ఇది నాకెంతో నచ్చిన ఫార్మాట్ అని.. తప్పుకుంటున్నందుకు బాధగా ఉందని క్లాసెన్ చెప్పుకొచ్చాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019లో టెస్టు ఎంట్రీ ఇచ్చిన క్లాసెన్ అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. ఈ విధ్వంసక ఆటగాడిపై పరిమిత ఓవర్ల ప్లేయర్ గా ముద్ర పడటంతో... ఇతడిని ఐదురోజుల ఫార్మాట్ కు పెద్దగా ఎంపిక చేసేవారు కాదు. దీనికి తోడు డికాక్ అద్బుతంగా ఆడటం.. వికెట్ కీపర్ కావడంతో జట్టు మేనెజ్ మెంట్ ఎక్కువగా అతడి వైపు మెుగ్గుచూపేది. పైగా క్లాసెన్ అవకాశాలను ఇచ్చినప్పటికీ అతడు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నాలుగు టెస్టుల్లో కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే 10 క్యాచ్లు, రెండు స్టంపౌట్లు చేశాడు. ఇక వన్డే, టీ20ల్లో అయితే క్లాసెన్ కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇతను 54 వన్డేల్లో 40.1 సగటుతో 1723 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఇక 43 టీ20ల్లో 722 రన్స్ చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 


Also Read: IND vs ENG: టీమిండియా బిగ్ షాక్.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఆ స్టార్ పేసర్ దూరం!


Also Read: Deepti Sharma: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. టీ20ల్లో ఆ ఫీట్ సాధించిన తొలి భార‌త క్రికెట‌ర్‌గా రికార్డు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి