IND vs AUS, 2nd WT20I Live Updates: టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma) టీ20ల్లో అరుదైన ఘనత సాధించింది. కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజాలకు సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకుంది. పొట్టి ఫార్మాట్ లో 1,000 పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు వంద వికెట్లు తీసిన తొలి భారత క్రికెటర్‌గా దీప్తి రికార్డు సృష్టించింది. జనవరి 7 (ఆదివారం)న నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఫీట్ సాధించింది.
ఆదివారం నవీ ముంబై వేదికగా భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ను వీక్షించడానికి 42వేల మందికిపైగా వచ్చారు. దీంతో స్టేడియం మెుత్తం ఇండియా నినాదాలతో మార్మోగిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆరు వికెట్లు తేడాతో భారత్ పై విజయం సాధించింది. దీంతో సిరీస్ ను సమం చేయగలిగింది ఆసీస్. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 మాత్రమే చేసింది. సహచర ఆటగాళ్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరినా దీప్తి శర్మ 30 పరుగులతో జట్టును ఆదుకుంది. రిచా ఘోష్ 23 పరుగులు, స్మతి మంధాన 23 పరుగులు చేశారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆరు పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్ బౌలర్లలో జార్జియో, అనాబెల్, కిమ్ రెండేసి వికెట్లు చొప్పున తీశారు.
అనంతరం లక్ష్యచేధనను ప్రారంభించిన ఆస్ట్రేలియా 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. 300వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఎల్లీస్ పెర్రీ జట్టుకు విజయాన్ని అందించింది. ఈమె 34 పరుగులుతో నాటౌట్ గా నిలిచింది. ఆ జట్టు ప్లేయర్లలో హేలీ 26, మూనీ 20 పరుగులు చేశారు. దీప్తి శర్మ రెండు వికెట్లు తీసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Deepti Sharma: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. టీ20ల్లో ఆ ఫీట్ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు..