హ్యాట్రిక్ ఓటమి తర్వాత PBKS పై గెలిచి IPL 2021లో ఖాతా తెరిచిన SRH
SRH vs PBKS match in IPL 2021: చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుసగా మూడు ఓటముల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు గెలుపు ఖాతా తెరిచింది. ఐపిఎల్ 2021లో భాగంగా నేడు జరిగిన 14వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH).. 9 వికెట్ల తేడాతో విజయం సాధించి లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చామనిపించుకుంది.
SRH vs PBKS match in IPL 2021: చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుసగా మూడు ఓటముల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు గెలుపు ఖాతా తెరిచింది. ఐపిఎల్ 2021లో భాగంగా నేడు జరిగిన 14వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH).. 9 వికెట్ల తేడాతో విజయం సాధించి లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చామనిపించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 19.4 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటివరకు ఐపీఎల్ 2021లో నమోదైన అత్యల్ప స్కోర్ ఇదే కాగా ఆ స్వల్ప లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు ఘనంగా 9 వికెట్ల తేడాతో ఛేదించి తమ సత్తా చాటుకుంది.
ఓపెనర్స్ జానీ బెయిర్‌స్టో (63 నాటౌట్: 56 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు రాబట్టగా.. డేవిడ్ వార్నర్ (37: 37 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులతో చెలరేగిపోవడం జట్టుకు శుభారంభాన్ని ఇచ్చినట్టయింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి పంజాబ్ కింగ్స్‌పై (PBKS) విజయం సాధించింది. డేవిడ్ వార్నర్ ఔట్ అయినా.. విలియమ్సన్ (16 నాటౌట్: 19 బంతుల్లో) సపోర్టుతో బెయిర్‌స్టో చివరి వరకు పోరాడి జట్టును గెలిపించి అద్భుతమైన విజయాన్ని అందించాడు.
Also read : IPL 2021: ఎంఎస్ ధోనీకి షాక్, CSK కెప్టెన్ తల్లిదండ్రులకు COVID-19 పాజిటివ్
మరోవైపు ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ (SRH Bowlers) కూడా తమ సత్తా చాటుకున్నారు. అందుకు ఫలితమే పంజాబ్ కింగ్స్ అత్యల్ప స్కోర్‌కి పరిమితమైంది. ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా మరో యువ బౌలర్ అభిషేక్ శర్మ రెండు వికెట్లు తీశాడు. ఆప్ఘన్ బౌలర్ రషీద్ ఖాన్ (Rashid Khan) 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఒకనొక దశలో పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఫలితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌కి (SRH squad) అధిక స్కోర్ వెంట పరుగులు తీసే తిప్పలు తప్పింది.
IPL 2021 records: Kieron Pollard ఖాతాలో ఐపిఎల్ 2021లో longest six రికార్డ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook