Asia Cup 2022: ఆగస్టు నుంచి యూఏఈలో ప్రారంభమయ్యే ఆసియా కప్‌కు అన్ని జట్లు సిద్ధమౌతున్నాయి. అటు పాకిస్తాన్..ఇటు శ్రీలంక జట్లను ప్రకటించారు. ఈ క్రమంలో టీమ్ ఇండియాకు సవాలుగా మారే క్రికెటర్ల గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసియా కప్ 2022 కోసం అన్ని జట్లు ప్రకటితమౌతున్నాయి. ఆగస్టు 27 నుంచి యూఏఈలో జరిగే ఆసియా కప్‌కు దాసున్ శనాకా నేతృత్వంలో శ్రీలంక జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. జట్టు వైస్ కెప్టెన్‌గా చరిత్ అసలంక వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో శ్రీలంకలో ఏయే ఆటగాళ్లు టీమ్ ఇండియాకు సవాలుగా మారవచ్చో తెలుసుకుందాం..


లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక ఆసియా కప్ 2022కు ఎంపికయ్యాడు. 21 ఏళ్ల మధుశంకతో పాటు అశేన్ భండారా కూడా ఉన్నాడు. జూలై 2021లో చివరిసారిగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు. శ్రీలంక తొలి మ్యాచ్ ఆగస్టు 27న ఆప్ఘనిస్తాన్‌తో తలపడనుంది. 


దినేష్ చాందీమల్ , ధనంజయ్ డిసిల్వాలు సైతం టీ20 జట్టుకు ఎంపికయ్యారు. ఇంతకుముందు ఆస్ట్రేలియాలో జరిగిన టీ20లో ఈ ఇద్దరూ ఆడలేదు. ఆసియా కప్‌లో శ్రీలంకతోపాటు ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండియా, రెండుసార్లు టైటిల్ సాధించిన పాకిస్తాన్, మూడు సార్లు రన్నరప్‌గా నిలిచిన బంగ్లాదేశ్ కూడా ఆడుతున్నాయి. 


ఆసియా కప్ 2022 కోసం శ్రీ లంక జట్టు


దాసున్ శనాకా, ధనుష్క గుణతిలక, పార్ధుమ్ నిసాంకా, కుసల్ మేండిస్, చరిత్ అసలంక, భానుకా రాజపక్ష, అశేన్ భండారా, ధనంజయ్ డిసిల్వా, వానిందు హసరంగ మహీష్ తీక్షణ, జైఫ్రీ వాండేరసే, ప్రవీణ్ జయవిక్రమ, చమికా కరుణారత్నే, దిల్షాన్ మధుశంక, మతీషా పాథిరానా, నువానిదు ఫెర్నాడో, దుష్మంత చమీరా, దినేష్ చాందీమల్ 


Also read: Asia Cup 2022: టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్, ఆసియా కప్‌కు దూరమైన పాక్ డేంజరస్ బౌలర్ షహీన్ షాహ్ అఫ్రిది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook