Ben Stokes: క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్‌ టెస్ట్‌ కెప్టెన్‌గా స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ నియమితులైయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టుకు 81వ కెప్టెన్‌గా స్టోక్స్ సేవలందించనున్నాడు. ఇటీవల ఇంగ్లీష్‌ జట్టు వరుస పరాజయాలను చవిచూస్తోంది. ఈక్రమంలోనే ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్సీ నుంచి జో రూట్ తప్పుకున్నాడు. దీంతో కొత్త కెప్టెన్‌ పేరును ఆ దేశ క్రికెట్ బోర్డు వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెన్‌ స్టోక్స్‌కు టెస్ట్ కెప్టెన్‌ బాధ్యతలు ఇచ్చేందుకు తాను పెద్దగా ఆలోచించలేదని ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ తెలిపాడు. స్టోక్స్‌ కెప్టెన్సీలో జట్టుకు ముందుకు దూసుకెళ్తుందన్నాడు. ఆ బాధ్యతలు స్వీకరించేందుకు స్టోక్స్ అంగీకరించాడని..ఇందుకు సంతోషిస్తున్నానని చెప్పాడు. ఇంగ్లండ్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకునేందుకు అతడు సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డాడు.


మరోవైపు బెన్ స్టోక్స్‌ ఇంగ్లండ్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. నిలకడగా ఆడుతూ జట్టుకు అండగా ఉంటున్నాడు. 2019లో ఇంగ్లండ్‌కు వన్డే ప్రపంచకప్‌ అందించి హీరోగా అవతరించాడు. అతడు 2013లో టెస్ట్‌ల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 73 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో స్టోక్స్ ఆడాడు. 2017లో ఇంగ్లీష్‌ టెస్ట్ టీమ్‌కు వైస్‌ కెప్టెన్‌గా పనిచేశాడు. 73 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 5 వేల 61 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 26 హాఫ్‌ సెంచరీలున్నాయి. బౌలింగ్‌లో 174 వికెట్లు తీశాడు. 


ఇటు ఇంగ్లండ్ తరపున 101 వన్డేలు ఆడాడు. మొత్తం 2 వేల 871 పరుగులు చేశాడు. పరిమిత మ్యాచ్‌లో 3 సెంచరీలు, 21 అర్ధ శతకాలున్నాయి. బౌలింగ్‌లోనూ 74 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌(IPL), కౌంటీ మ్యాచ్‌ల్లోనూ అదరగొట్టాడు. వరుస పరాజయాలతో సతమత అవుతున్న ఇంగ్లండ్‌కు బెన్ స్టోక్స్‌ కెప్టెన్సీ ఏమేరకు పని చేస్తుందో చూడాలి.


Also read:Realme GT 2 Offer: రూ.40 వేల విలువైన Realme స్మార్ట్ ఫోన్ ను రూ.17 వేలకే కొనండి!


Also read:Dog Losses 1.5 lakh: కుక్క వల్ల యజమానికి రూ. లక్ష 50 వేలు నష్టం.. ఏమిటా కథ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.