Dog Losses 1.5 lakh: శునకం అంటే విశ్వాసానికి మారు పేరు అంటారు. అలాంటి శునకమే ఆ యజమాని కొంప ముంచింది. ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును రోడ్డు పాలు చేసింది. చేసేదేమిలేక ఆ యజమాని లబోదిబోమంటున్నాడు. అసలు శునకం చేసిన ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం..
వరంగల్ జిల్లా దుగ్గిండి మండలం నాచినపల్లికి చెందిన చేరాలు అనే గొర్రెల కాపరి..ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. గొర్రెలతోపాటు ఆ శునకాన్ని అల్లారు ముద్దుగా సాకుతున్నాడు. ఆ ప్రేమనే ఆ యజమాని పాలిట శాపంగా మారింది. తాను పైసా పైసా కూడపెట్టి డబ్బు పోగు చేసుకుంటున్నాడు. ఈక్రమంలోనే సంపాదించిన లక్షా 50 వేల రూపాయలను తన వద్దే ఉంచుకున్నాడు. రోజూ సంచిలో సొమ్ము వేసుకుని నడుముకు కట్టుకునే వాడు.
ఇలా ఈనెల 25న యాధావిధిగా గొర్రెల కాపరి నడుముకు ఉన్న సంచిని తీసి మంచంపై పెట్టి స్నానానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఆ డబ్బు లేదు. దీంతో అతడు కంగుతిన్నాడు. తాను పెంచుకున్న కుక్కే ఎక్కడో పడేసిందని గుర్తించాడు. చుట్టుపక్కాల వెతికాడు. ఎక్కడా ఆ డబ్బు దొరకలేదు. కష్టించి పని చేసి పోగుచేసిన సొమ్ము పోవడంతో గొర్రెల కాపరి చేరాలు లబోదిబోమంటున్నాడు.
ఇప్పుడా వార్త సంచలనంగా మారింది. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. చివరకు ఆ బాధితుడు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తన డబ్బు పోయిందని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు చెబుతున్నాడు. ఈ ఘటన విని పోలీసులు సైతం షాక్ అయ్యారు. ఈ కేసును ఎలా చేధించాలో వారికి సైతం అర్థం కావడం లేదు. ఇప్పుడా వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also read: WhatsApp Cashback: వాట్సాప్ పేమెంట్స్‌తో భారీగా క్యాష్‌బ్యాక్.. పొందండి ఇలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.