Stuart Broad Announces Retirement: ఇంగ్లాండ్ స్పీడ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో ఐదో టెస్టు తరువాత రిటైర్ అవుతున్నట్లు తెలిపాడు. శనివారం ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు మూడో రోజు ముగిసిన అనంతరం బ్రాడ్ తన రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించాడు. ఈతరం ఆటగాళ్లలో గొప్ప బౌలర్‌గా పేరు సంపాదించుకున్న 37 ఏళ్ల బ్రాడ్.. అనూహంగా క్రికెట్‌కు గుడ్ బై చెప్పడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. తన సహచరుడు జేమ్స్ అండర్సన్‌తో కలిసి ఎన్నో అద్భుత విజయాలు అందించిన బ్రాడ్ రిటైర్మెంట్ నిర్ణయం ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారం ఓవల్‌లో మూడో రోజు ఆట ముగిసిన తర్వాత బ్రాడ్ మాట్లాడుతూ.. "రేపు లేదా సోమవారం నా చివరి క్రికెట్ మ్యాచ్ రోజు. ఇది అద్భుతమైన కెరీర్. నాటింగ్‌హామ్‌షైర్, ఇంగ్లాండ్ జట్ల తరుఫున ఆడడం నాకెంతో గర్వకారణం. నేను క్రికెట్‌ను ఎప్పటిలాగే ప్రేమిస్తున్నాను. యాషెస్ సిరీస్ అంటే నాకెంతో ఇష్టం. అందుకే ఈ సిరీస్‌ నుంచే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నా.  


గత రాత్రి 8.30 గంటలకు రిటైర్ కావాలని నిర్ణయం తీసుకున్నా. గత రెండు వారాలుగా దాని గురించి ఆలోచిస్తున్నాను. శుక్రవారం రాత్రి కెప్టెన్ బెన్ స్టోక్స్‌కి.. శనివారం ఉదయం మిగతా సహచరులకు చెప్పాను. నేను ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లను చాలా ఇష్టపడ్డా. నాకు యాషెస్‌తో ఎంతో అనుబంధం ఉంది. నా చివరి మ్యాచ్‌లో బౌలింగ్ ఈ సిరీస్‌లోనే కావాలని కోరుకున్నాను. ఈ విషయం నేను నిన్న రాత్రి స్టోక్సీకి చెప్పాను. ఈ ఉదయం డ్రెస్సింగ్‌లో రూమ్‌లో అందరితో మాట్లాడా. రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం అని అనిపించింది" అని తెలిపాడు. 


2006 ఆగస్టు 28న పాకిస్థాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో బ్రాడ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదే ఏడాది వన్డే జట్టులోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. 2007 డిసెంబర్‌లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్‌ను ఆరంభించాడు. వన్డేలు, టీ20లకు ప్రాతినిధ్యం వహించినా.. టెస్టుల్లోనే బ్రాడ్ ఇంగ్లాండ్‌కు నమ్మదగిన బౌలర్‌గా ఎదిగాడు. దాదాపు ఆరేళ్లుగా కేవలం టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు. మొత్తం కెరీర్‌లో 167 టెస్టు మ్యాచ్‌లు ఆడిన బ్రాడ్.. 602 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 600 వికెట్లు తీసిన రెండో ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. 20 సార్లు 5 వికెట్లు తీయగా.. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మూడుసార్లు 10 వికెట్లు తీశాడు. 121 వన్డేల్లో 178 వికెట్లు తీశాడు. 56 టీ20 మ్యాచుల్లో 65 వికెట్లు పడగొట్టాడు. అయితే స్టువర్ట్ బ్రాడ్‌కు ఐపీఎల్‌లో ఆడే అవకాశం రాలేదు. 


2007 టీ20 ప్రపంచ కప్‌లో యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన ఓవర్‌ను క్రికెట్‌ అభిమానులు ఎన్నటికీ మరువలేరు. ఈ ఓవర్ వేసిన బౌలర్ బ్రాడ్. అప్పుడు ఈ స్పీడ్ స్టార్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. అయినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో తిరిగి పుంజుకున్న బ్రాడ్.. ప్రపంచంలో అద్భుత బౌలర్‌గా ఎదిగాడు. 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఇంగ్లాండ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ చెప్పాడు.  


Also Read: GST On Hostels: హాస్టల్స్, పీజీలో ఉంటున్న వారికి బ్యాడ్‌న్యూస్.. ఫీజుల మోత తప్పదా..?  


Also Read: Telangana Floods: రేపు తెలంగాణకు కేంద్ర అధికారుల బృందం.. వరద నష్టంపై అంచనా   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి