GST on Rent of PG and Hostel: పీజీ, హాస్టల్స్‌లో ఉంటూ.. కోర్సులు నేర్చుకుంటున్న వారు, ఉద్యోగాలు చేసుకుంటున్న వారు.. కాలేజీలకు వెళుతున్న వారు ఎందరో ఉన్నారు. వారందరికీ బ్యాడ్‌న్యూస్ ఇంది. హాస్టల్ వసతి, పేయింగ్ గెస్ట్‌ల ద్వారా చెల్లించే అద్దెపై ఇక నుంచి 12 శాతం జీఎస్‌టీ విధించాలని కర్ణాటకలోని అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్ (ఏఏఆర్) తెలిపింది. హాస్టల్ బస లేదా పీజీ వసతిపై అద్దెకు జీఎస్‌టీ మినహాయింపు ఉంటుందా లేదా అనే అంశంపై ఇన్నాళ్లు గందరగోళం నెలకొంది. తాజాగా ఏఏఆర్ తీర్పుతో జీఎస్‌టీ విధించాలని క్లారిటీ వచ్చేసింది. హాస్టళ్లు నివాస గృహాలకు సమానం కాదని.. జీఎస్‌టీ కింద మినహాయింపు ఉండదని పేర్కొంది.
శ్రీసాయి లగ్జరీస్ స్టే దాఖలు చేసిన ఎల్‌ఎల్‌పీపై విచారించిన ఏఏఆర్ బెంగళూరు బెంచ్.. రెసిడెన్షియల్ ఫ్లాట్ లేదా ఇల్లు, హాస్టల్ లేదా పీజీ ఒకేలా ఉండవని తెలిపింది. హాస్టళ్లు, పీజీలు వంటి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేవారు 12 శాతం జీఎస్‌టీ చెల్లించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. వాటిని జీఎస్‌టీ నుంచి మినహాయించకూడదని పేర్కొంది. జూలై 17, 2022 వరకు బెంగళూరులోని హోటళ్లు, క్యాంప్‌సైట్‌లు లేదా క్లబ్‌లకు రూ.1,000 వరకు జీఎస్‌టీ నుంచి మినహాయించారని.. అయితే హాస్టల్స్ లేదా పీజీలు అర్హులు కాదని చెప్పింది.
"పీజీ/హాస్టల్స్ జీఎస్‌టీ మినహాయింపునకు అర్హత పొందవు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ, పీజీ హాస్టల్ రెండూ ఒకేలా ఉండవు. ఒకే నియమాన్ని రెండింటికీ వర్తించదు. దీంతో పాటు ఎవరైనా నివాస ప్రాపర్టీని గెస్ట్ హౌస్ లేదా లాడ్జ్‌గా ఉపయోగిస్తే.. దానిని జీఎస్టీటి పరిధిలోకి చేర్చబోం. దరఖాస్తుదారుడి సేవలు జీఎస్‌టీకి విధించదగినవి. దరఖాస్తుదారు భూయజమానులకు చెల్లించే అద్దెపై రివర్స్ ఛార్జీపై జీఎస్‌టీ వర్తిస్తుంది.." అని కర్ణాటక ఏఏఆర్‌కి చెందిన ఎంపీ రవిప్రసాద్, కిరణ్ రెడ్డి టి బెంచ్ తీర్పునిచ్చింది.
నోయిడాకు చెందిన VS ఇనిస్టిట్యూట్ & హాస్టల్ ప్రైవేట్ లిమిటెడ్ దరఖాస్తుపై లక్నో బెంచ్ రోజుకు రూ.1,000 కంటే తక్కువ ఖర్చుతో కూడిన హాస్టల్ వసతిపై జీఎస్‌టీ వర్తిస్తుందని ఇదే తరహాలో తీర్పు వెల్లడించింది. ఈ నిబంధన 18 జూలై 2022 నుంచి వర్తిస్తుందని తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో హాస్టల్స్, పీజీలు ధరలు పెంచే అవకాశం ఉంది.
Also Read: Revanth Reddy: సీఎం, మున్సిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారు.. పిండ ప్రదానం చేయండి: రేవంత్ రెడ్డి
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి