Tokyo paralympics 2021: అదరగొట్టేసిన సుమిత్... భారత్‌కు మరో స్వర్ణం!
పారా ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్స్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ మొదటి స్థానం కైవసం చేసుకొని మరో పసిడి పతాకాన్ని దేశం ఖాతాలో వేసాడు.
Tokyo paralympics 2021: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో (Tokyo paralympics 2021) భారత్ ఆటగాళ్లు దుమ్ములేపుతున్నారు. తాజాగా జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ (Sumit Antil) మనదేశానికి మరో స్వర్ణం అందించాడు. ఇవాళ జరిగిన ఫైనల్ పోరులో అందరి కంటే అత్యధికంగా 68.55 మీటర్ల దూరం జావెలిన్ విసిరిన (Javelin Throw)సుమిత్.. మొదటి స్థానం కైవసం చేసుకొని పసిడి పతకం సాధించాడు.
ఆరంభం నుంచే దూకుడుగా..
ఇవాళ జరిగిన పారా ఒలింపిక్స్ పోటీల్లో సుమిత్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించాడు. మొదటి రౌండ్‌లో 66.95 మీటర్ల దూరం జావెలిన్ విసిరిన అతడు.. రెండో రౌండ్లో 68.08 మీటర్లు, ఐదో రౌండ్లో ఏకంగా 68.55 మీట్లర్ల దూరాన్ని అందుకున్నాడు. అంతేకాకుండా ఎఫ్-64 విభాగంలో పోటీపడిన సుమిత్.. ప్రపంచ రికార్డునూ తన పేరిట లిఖించుకున్నాడు.
Also Read: Good News: ఇంట్లో కూర్చొనే డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు.. కేంద్రం ప్రభుత్వం కొత్త విధానం
హర్యానా కుర్రాడు..
హర్యానాలోని (Haryana) సోనిపట్‌కు (Sonipat) చెందిన సుమిత్ అంటిల్ 2015 వరకు సాధారణ కుర్రాడే. అయితే అప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు ఎడమకాలును పోగొట్టుకున్నాడు. దీంతో కృత్రిమ కాలుతోనే జీవనం సాగిస్తున్నాడు. తన గ్రామానికి చెందిన ఓ పారా అథ్లెట్‌ను (Athlete) చూసి స్ఫూర్తి పొందిన సుమిత్.. అథ్లెటిక్స్ వైపు దృష్టి పెట్టాడు. జావెలిన్ ప్లేయర్‌గా కెరీర్‌ను ప్రారంభించి కఠోర శిక్షణ పొందాడు. ఆ తర్వాత 2018 నుంచి పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పోటీపడ్డాడు. అలా 2019లో దుబాయ్‌లో (Dubai) జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ (World championship) పోటీల్లో సిల్వర్ (Silver medal) నెగ్గి అందరి దృష్టిని ఆకర్షించాడు.
రెండో స్వర్ణమిది..
ప్రస్తుతం జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో (Tokyo paralympics 2021) ఆర్చరీ (Archery) క్రీడలోనూ భారత్‌కు స్వర్ణం వచ్చింది. షూటర్ అవని లేఖరా (Avani Lekhara).. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో గోల్డ్ సొంతం చేసుకుంది. ఆమె తర్వాత సుమిత్ రెండో పసిడి అందించాడు. ఇప్పటివరకు భారత ఆటగాళ్లు 7 పతకాలు సాధించారు. అందులో రెండు స్వర్ణాలు, 4 సిల్వర్, ఒక కాంస్య పతకం ఉన్నాయి.
Also Read: Viral Photo: ఈ ఫోటోలో సింహం ఉంది...ఈజీగా గుర్తించవచ్చు..ఎక్కడుందో కనిపెట్టండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook