కొద్ది రోజులుగా యువ క్రికెటర్ హార్దిక్ పాండ్యాను దిగ్గజ క్రికెటర్ కపిల్‌ దేవ్‌తో పోల్చుతున్న విషయం తెలిసిందే. దీనిపై సునీల్ గవస్కర్ స్పందించారు. టీమిండియా దిగ్గజ క్రికెటరైన కపిల్ దేవ్‌ను ఎవరితోనూ పోల్చకూడదని ఆయన అన్నారు. 'కపిల్‌ దేవ్‌ను ఎవరితోనూ పోల్చరాదు. అతను కేవలం ఒక జనరేషన్‌కి మాత్రమే ఆటగాడు కాదు. సర్ డాన్ బ్రాడ్‌మాన్, సచిన్‌లా నూరేళ్లకొక్క ఆటగాడు' అని ఓ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధావన్ మైండ్ సెట్ మార్చుకో..!


టెస్టుల్లో శిఖర్‌ ధావన్ ఆట తీరు మార్చుకోకపోవడం టీమిండియాకు నష్టం కలిగిస్తోందని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. 'టెస్టుల్లో సుదీర్ఘ సమయం బ్యాటింగ్ చేయాలి. ఓపెనర్‌గా వచ్చే ధావన్ చాలా బాధ్యతగా ఆడాల్సి ఉంటుంది. వన్డే, టీ20ల్లో ఉండే మైండ్‌సెట్‌తోనే ధావన్ ఆడుతున్నాడు. ఇది మంచిది కాదు' అని గవాస్కర్ అన్నారు.  బర్మింగ్‌హోమ్‌లో జరిగిన తొలి టెస్టులో ధావన్ 26, 13 పరుగులు చేశాడు. కాగా ధావన్‌ను రెండో టెస్టు మ్యాచ్ నుండి తొలగించాలని డిమాండ్ పెరుగుతోంది.


ఐదు టెస్టుల సిరీస్‌‌లో రెండో టెస్టులో సమం చేయాలంటే అదనపు బ్యాట్స్‌మన్‌ను ఆడించాల్సి ఉంటుందన్నారు. పుజారా రాణించాలంటే, మరింత సహనం, టెక్నిక్‌ అవసరమని.. లార్డ్‌ టెస్టులో నెగ్గాలంటే, టాస్‌ గెలవగానే బ్యాటింగ్‌ ఎంచుకోవాలని గావస్కర్‌ అభిప్రాయపడ్డారు.