IND vs SA: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమితో.. టీమ్ ఇండియాపై సునీల్ గావస్కర్ అసంతృప్తి
IND vs SA: దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ ఓటమిపై సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చివరి మ్యాచ్‌లో టీమ్ ఇండియా తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
IND vs SA: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఓడిపోయింది. దీంతో దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ కైవసం చేసుకోవాలన్న భారత్ కల (India lost test Series with SA
) నెరవైరలేదు.
చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా.. అన్ని విధాలుగా విఫలమైంది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ పూర్తిగా (Team India Failure test Series with SA) చేతులెత్తేశారు.
టీమ్ ఇండియా పేవలవ ప్రదర్శనపై.. మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ టీమ్ ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ సేన ఆట తీరుపై విమర్శలు (Sunil Gavaskar slams Virat Kohli) గుప్పించారు. దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ కైవసరం చేసుకోవాలన్న లక్ష్యం.. ఓ పీడకలగా మిగిలిపోయిందన్నారు.
గావస్కర్ ఇంకా ఏమన్నారంటే..
చివరి మ్యాచ్ గురించి స్టార్ స్పోర్ట్స్‌లో గావస్కర్ మాట్లాడాడు. లంచ్ బ్రేక్ తర్వాత.. శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా ఎందుకు బౌలింగ్ చేయలేదో తనకు అర్థం కాలేదని అన్నాడు. కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయంపై గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ గెలవలేమని భారత్ దాదాపు ముందే నిర్ణయించుకున్నట్లు అభిప్రాయపడ్డాడు.
ఇక రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ చేసే సమయంలో ఫీల్డింగ్ సరిగా లేకపోవడంపై కూడా గావస్కర్ టీమ్ ఇండియాపై ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆ సమయంలో ఫీల్డర్ల ప్లేస్మెంట్ సరిగా లేదన్నాడు. అందువల్లే బ్యాటింగ్‌కు క్లిష్టమైన పిచ్‌లో సైతం దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడగలిగిందన్నాడు.
మొదటి మ్యాచ్‌లో అద్భుతం చేసినా..
మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా.. సెంచూరియాలో మొదటి మ్యాచ్ జరిగింది. ఇందులో 113 పరుగుల తేడాతో టీమ్ ఇండియా అద్భుత విజయం సాధించింది.
జొహన్నస్ బర్గ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం ఒటమి పాలైంది. ఇక తాజాగా కేప్‌టౌన్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో 1-2 తేడాతో సిరిస్‌లో ఓటమి పాలైంది.
ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. ఈ సారి సిరీస్ గెలవాలన్న కోహ్లీ కల మరోసారి కలగానే ఉండిపోయింది.
చివరి టెస్టు సాగిందిలా..
చివరి టెస్టులో 212 పరుగుల లక్ష్యాన్ని.. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కీగన్ పీటర్సన్ 81 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. వాండెర్ డస్సెన్ 41, టెంబా బావుమా 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయింది టీమ్ ఇండియా. బుమ్రా, మహమ్మద్ షమి, శార్దుల్ ఠాకూర్లు ఒక్కో వికెట్ పడగొట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook