ఈ మ్యాచ్‌లో అంతా బౌలర్లదే హవా. వారి ప్రతిభ కారణంగానే  సన్‌రైజర్స్‌ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా రషీద్‌ ఖాన్‌ (3/19), షకిబ్‌ అల్‌ హసన్‌ (2/18)  తమ బౌలింగ్ మాయాజాలంతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించడంతో సన్ రైజర్స్ జట్టు 13 పరుగుల తేడాతో గెలిచింది. పంజాబ్ మాత్రం 19.2 ఓవర్లలో కేవలం 119 పరుగులు మాత్రమే చేసి ఓటమిని చవిచూసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాస్ ఓడి తొలి బ్యాటింగ్ చేయడానికి వచ్చిన సన్‌రైజర్స్‌ జట్టులో మనీశ్‌ పాండే తన సత్తాను చాటాడు. 51 బంతుల్లో 54 పరుగులు చేసి స్కోరు పెరగడానికి కారకుడయ్యాడు. అతనికి  షకిబ్‌ అల్‌ హసన్‌ కూడా మంచి సహకారం అందించడంతో స్కోరు బోర్డు బాగానే పరుగెత్తింది . కాకపోతే ఆ తర్వాత వికెట్లు వేగంగా పడిపోవడంతో కేవలం సన్ రైజర్లు 132 పరుగులు మాత్రమే చేయగలిగారు. పంజాబ్ బౌలర్ రాజపుత్ 5 వికెట్లు తీసి సన్ రైజర్స్ నడ్డి విరిచాడు.


ఇక పంజాబ్ విషయానికి వస్తే బ్యాట్స్‌మన్ మొదటి నుంచీ తడబాటుగానే ఆడారు.  కేఎల్‌ రాహుల్‌ (32; 26బంతుల్లో 4×4, 1×6), గేల్‌ (23; 22బంతుల్లో 1×4, 2×6) తప్ప మిగతా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.


మయాంక్‌ అగర్వాల్‌ 12 పరుగులు (15 బాల్స్), కరుణ్‌ నాయర్‌ 13 పరుగులు (17 బాల్స్) అరోన్‌ ఫించ్‌ 8 పరుగులు (4 బాల్స్), మనోజ్‌ తివారీ 1 పరుగు (5 బాల్స్ ) లాంటివారు కూడా వేగంగానే వికెట్లు కోల్పోయారు. దాంతో పంజాబ్ ఓటమి అంచులమాటున ఉన్న సంగతి ప్రేక్షకులకు ముందుగానే తెలిసిపోయింది. ఫలితంగా సన్ రైజర్స్ గెలిచింది