SRH Team New Song: కేన్ అండ్ కో `ఐ లవ్ బిర్యానీ సాంగ్`.. వైరల్ అవుతున్న సన్ రైజర్స్ సాంగ్..
మేము హైడ్రా బూగ్గీ బ్యాండ్ గా మీ ముందుకు వచ్చాం.. సొంతంగా పాటను రచించాం.. మమ్మల్ని భరించండి అంటూ వీఆర్ ద సన్ రైజర్స్ .. వీ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్.. వీ లవ్ బిర్యానీ అని కెప్టెన్ కేన్ విలియమ్సన్ తోడుగా అబ్దుల్ సమద్, మార్కరం, గ్లెన్ ఫీలిప్స్ సింగర్స్ పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Sunrisers Hyderabad we Love Biryani: సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ మెగా టోర్నీలో పెద్దగా అంచనాలు లేకుండా అడుగుపెట్టిన జట్లల్లో ఇది ఒకటి. కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టు ఆడిన తొలి రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో హైదరాబాద్ పరాజయం పాలైంది. దీంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఢీలా పడిపోయారు. గత సీజన్ లాగే లీగ్ దశలోనే
ఇంటిబాటపడుతుందని భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. రెండు వరుస ఓటములకు ప్రతీకారంగా.. వరుసగా ఐదు మ్యాచుల్లో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ తో మొదలైన హైదరాబాద్ జట్టు విజయయాత్ర.. ఆర్సీబీ మ్యాచ్ వరకు కొనసాగింది.
వరుస విజయాలతో ఉన్న హైదరాబాద్ జట్టు సెలబ్రేషన్స్ లో తగ్గేదేలే అంటోంది. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత ఆరెంజ్ ఆర్మీ సభ్యులు తమలోని ప్రతిభను బయటకుతీశారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ గిటారిస్ట్ అవతారం ఎత్తాడు. అతనికి తోడుగా అబ్దుల్ సమద్, మార్కరం, గ్లెన్ ఫీలిప్స్ సింగర్స్ గా మారారు.
మేము హైడ్రా బూగ్గీ బ్యాండ్ గా మీ ముందుకు వచ్చాం.. సొంతంగా పాటను రచించాం.. మమ్మల్ని భరించండి అంటూ పాటను స్టార్ట్ చేయడానికి ముందు ఓ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు కేన్ మామ. వీఆర్ ద సన్ రైజర్స్ .. వీ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్.. వీ లవ్ బిర్యానీ అని పాటను స్టార్ట్ చేశాడు. మా అభిమానులు మమ్మల్ని ఆరెంజ్ ఆర్మీ అని ముద్దుగా పిలుస్తారని.. ఆ తర్వాత కోచ్ లు, ఆటగాళ్ల పేర్లను పాటలో కలుపుతూ ఎంతో చక్కగా పాడారు.
ఈ వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఏ స్పెషల్ సాంగ్ ఫ్రమ్ కేన్ మామ అండ్ కంపెనీ అని దానికి క్యాప్షన్ ఇచ్చింది. ఈ పాట ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కేన్ మామ గిటార్ ఎంతో బాగా ప్లే చేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Ram Charan Upasana: చిరంజీవి అంటే భయమా లేదా ఉపాసననా.. తెలివైన సమాధానం ఇచ్చిన రామ్ చరణ్!
Also Read: Tamil Nadu Train Accident: ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చిన ట్రైన్.. బయటకు దూకిన ప్రయాణికులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook