Tamil Nadu Train Accident: ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చిన ట్రైన్‌.. బయటకు దూకిన ప్రయాణికులు!

Tamil Nadu Train Accident. తమిళనాడు రాజధాని చెన్నైలో రన్నింగ్ ట్రైన్‌ ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకొచ్చింది. ఆదివారం చెన్నైలోని బీచ్‌ స్టేషన్‌లో సబర్బన్‌ రైలు అదుపుతప్పి ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 24, 2022, 07:36 PM IST
  • ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చిన ట్రైన్‌
  • బయటకు దూకిన ప్రయాణికులు
  • వీడియో సోషల్ మీడియాలో వైరల్
Tamil Nadu Train Accident: ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చిన ట్రైన్‌.. బయటకు దూకిన ప్రయాణికులు!

Tamil Nadu Train Accident: తమిళనాడు రాజధాని చెన్నైలో రన్నింగ్ ట్రైన్‌ ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకొచ్చింది. ఆదివారం చెన్నైలోని బీచ్‌ స్టేషన్‌లో సబర్బన్‌ రైలు అదుపుతప్పి ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చింది. దాంతో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణీకులందరూ బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

చెన్నై వర్క్‌షాప్‌ నుంచి కోస్టల్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రైన్ అదుపుతప్పి భారీ శబ్దంతో ప్లాట్‌ఫామ్‌ వైపుపైకి దూసుకోచ్చింది. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణీకులు ఇది గమనించిన పరుగులు పెట్టారు. అదేసమయంలో సబర్బన్‌ రైలులో ఉన్న ప్రయాణికులు రైలు నుంచి బయటకు దూకారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ ప్రమాదంలో రైలు డ్రైవర్ కూడా బయటకు దూకాడు. స్వల్ప గాయాలు అయిన అతడిని వెంటనే అక్కడి అధికారులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్లాట్‌ఫారమ్ యొక్క ఓవర్‌షాట్ బఫర్ ఎండ్ ఖాళీగా ఉండటం వలన ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ఘటనపై రైల్వే విచారణకు ఆదేశించింది. 

Also Read: Ram Charan Upasana: చిరంజీవి అంటే భయమా లేదా ఉపాసననా.. తెలివైన సమాధానం ఇచ్చిన రామ్ చరణ్!

Also Read: Yash New Look: ఎట్టకేలకు గడ్డం తీసేసిన యష్.. రాఖీ భాయ్ నయా లుక్ పోలా అదిరిపోలా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News