Kalavathi Song: మొన్నటివరకూ పుష్ప మేనియా ఇంకా ఆ మేనియాలోంచి బయటపడనే లేదు..ఇప్పుడు సర్కారువారి పాట వెంటాడుతోంది. కమ్మాన్ కమ్మాన్ కళావతి అంటూ పిలుస్తున్నారు. స్టెప్పులతో సందడి చేస్తున్నారు క్రీడాకారులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్ప మేనియా ప్రపంచాన్ని చుట్టేసిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమాలో పాటలకు క్రీడాకారుల్నించి మొదలుకుని..వివిధ రంగాల్లోని సెలెబ్రిటీలంతా స్టెప్పులేస్తూ తెగ సందడి చేస్తున్నారు. ఇప్పుడు పుష్ప మేనియా నుంచి బయటపడేలోగా..సర్కారువారి పాట ఈ అందరితో స్టెప్పులేయిస్తోంది. మరి కొద్దిరోజుల్లో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కానుంది. దాంతో అభిమానులకు చేరువయ్యేందుకో..లేదా సరదాకో చేసే ఆటగాళ్లు చేసే ప్రయత్నాలు వైరల్ అవుతున్నాయి. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న సర్కారువారి పాటలో ఇప్పటికే విడుదలైన కమ్మాన్ కమ్మాన్ కళావతి పాట అందర్నీ ఊపేస్తోంది.



ఇప్పుడు ఆటగాళ్లు కూడా ఈ పాటకు స్టెప్పులేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కమ్మాన్ కమ్మాన్ కళావతి అంటూ పిలుస్తున్నారు. కళావతి పాటకు స్టెప్పులేస్తూ తెగ సందడి చేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు అభిషేక్ శర్మ అదే చేశాడు. ఐపీఎల్ మెగా వేలంలో 6.50 కోట్లకు అభిషేక్ శర్మను ఎస్ఆర్‌హెచ్ జట్టు కొనుగోలు చేసింది. మార్చ్ 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022లో తొలి మ్యాచ్‌ను ఎస్ఆర్‌హెచ్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. కళావతి పాటకు అభిషేక్ శర్మ చేసిన డ్యాన్స్ అందర్నీ ఫిదా చేస్తోంది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. 


Also read: Amazon Mobile Savings Days: అమెజాన్ మొబైల్ సేవింగ్స్..ఇవాళే చివరిరోజు, ఆ ఫోన్ కేవలం 549 రూపాయలు మాత్రమే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook