Sunrisers Hyderabad IPL 2022 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 పూర్తి షెడ్యూలును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం ప్రకటించింది. మెగా లీగ్ మార్చి 26న ప్రారంభం అయి.. మే 29న ముగుస్తుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో మొదలై.. మే 29న జరగనున్న ఫైన‌ల్ మ్యాచ్‌తో ముగియ‌నుంది. 65 రోజుల‌ పాటు అభిమానుల‌ను అల‌రించ‌నున్న ఐపీఎల్ 2022లో 70 లీగ్ మ్యాచ్‌లు, 4 ప్లేఆఫ్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. మహారాష్ట్రలోని 4 మైదానాల్లో ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నుండ‌గా.. అహ్మ‌దాబాద్‌లో ప్లే ఆఫ్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022లో తెలుగు జట్టు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ప్రయాణం మార్చి 29న ఆరంభం కానుంది. ఎస్‌ఆర్‌హెచ్ త‌న తొలి మ్యాచ్‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ఆడ‌నుంది. పుణేలోని ఎంసీఏ స్టేడియంలో రాత్రి 7:30 గంట‌ల‌కు హైద‌రాబాద్, రాజ‌స్థాన్ మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఇక చివ‌రి మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్‌తో ఆడ‌నుంది. ఈ మ్యాచ్ వాంఖ‌డే స్టేడియం;ప్ మే 22న‌ రాత్రి 7:30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. మొత్తం ఐపీఎల్ లీగ్ ద‌శ మ్యాచ్‌ల్లోనూ ఇదే చివ‌రి మ్యాచ్. ఎస్‌ఆర్‌హెచ్ లీగ్ దశలో మొత్తం 14 మ్యాచులు ఆడనుంది. 


ఐపీఎల్ 2022 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 23 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. ఈ 23 మందిలో ముగ్గురి ఆటగాళ్లను (కేన్ విలిమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్) వేలంకు ముందు అట్టిపెట్టుకోగా.. ఐపీఎల్ 2022 వేలంలో 20 మందిని కొనుగోలు చేసింది. వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ చాలా మంది ఆల్‌రౌండర్‌లను తీసుకుంది. అయితే 7 మంది స్టార్ ప్లేయర్స్ విదేశీ ఆటగాళ్లు కావడమే కాస్త ప్రతికూలాంశం. కేన్ విలియమ్సన్ సారథ్యంలో ఈసారి జట్టు సత్తాచాటుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు. 


ఎస్‌ఆర్‌హెచ్ షెడ్యూల్ ఇదే:
1) మార్చి 29 - రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ - ఎంసీఏ స్టేడియం - రాత్రి 7:30 


2) ఏప్రిల్ 4 - పుణే సూప‌ర్ జెయింట్స్‌ - డివై పాటిల్ స్టేడియం - రాత్రి 7:30


3) ఏప్రిల్ 9 - చెన్నైసూప‌ర్ కింగ్స్‌ - డివై పాటిల్ స్టేడియం - మ‌ధ్యాహ్నం 3:30


4)  ఏప్రిల్ 11 - గుజ‌రాత్ టైటాన్స్‌ - డివై పాటిల్ స్టేడియం - రాత్రి 7:30


5) ఏప్రిల్ 15 -  కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ - బ్రబౌర్న్ స్డేడియం - రాత్రి 7:30 


6) ఏప్రిల్ 17 - పంజాబ్ కింగ్స్‌ - డివై పాటిల్ స్టేడియం - మ‌ధ్యాహ్నం 3:30


7) ఏప్రిల్ 23 - రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు -  బ్రబౌర్న్ స్డేడియం - రాత్రి 7:30


8) ఏప్రిల్ 27 - గుజ‌రాత్ టైటాన్స్‌ - వాంఖ‌డే స్టేడియం - రాత్రి 7:30


9) మే 1- చెన్నై సూప‌ర్ కింగ్స్‌ - ఎంసీఏ స్డేడియం - రాత్రి 7:30


10) మే 5 - ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ - బ్రబౌర్న్ స్టేడియం - రాత్రి 7:30 


11) మే 8 - రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు - వాంఖ‌డే స్టేడియం - మ‌ధ్యాహ్నం 3:30


12) మే 14 - కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ - ఎంసీఏ స్టేడియం - రాత్రి 7:30


13) మే 17 - ముంబై ఇండియ‌న్స్‌ - వాంఖ‌డే స్టేడియం - రాత్రి 7:30


14) మే 22 - పంజాబ్ కింగ్స్‌ - వాంఖ‌డే స్టేడియం - రాత్రి 7:30


సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ప్రియం గార్గ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కార్తీక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్, ఐడెన్ మార్క్‌రామ్, మార్కో జాన్సెన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్, శశాంక్ సింగ్, సౌరభ్ దూబే, ఫజల్హాక్ ఫరూకీ, గ్లెన్ ఫిలిప్స్, విష్ణు వినోద్. 


Also Read: Jr NTR Fans: మొదలైన ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా.. ఏకంగా థియేటర్‌నే బుక్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌! ఎక్కడో తెలుసా?


Also Read: Telangana Budget Session: తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. సమావేశాలు ముగిసేంతవరకూ వేటు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook