PBK vs SRH: పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్- వరుసగా నాలుగు విజయాలు..
PBK vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. నేడు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో 7 బాల్స్ మిగిలి ఉండగానే విజయం సాధించింది.
PBK vs SRH: ఐపీఎల్ 2022లో భాగంగా బంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఘన విజయం సాధించింది. 152 పరగుల లక్ష్యాన్ని మూడు వికెట్ల నష్టంతో.. ఇంకా 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు.
ఓపెనర్‌గా దిగిన కేన్ విలియమ్సన్ విఫలమైన.. స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించారు. ఎస్ఆర్హెచ్కు వరుసగా ఇది నాలుగో విజయం కావడం విశేషం. వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్లో 4వ స్థానానికి ఎగబాకింది.
విలియమ్సన్ మూడు పరుగలకే ఔట్ అవగా.. మరో ఓపెనర్ అభిషేర్ శర్మ 31 (25 బంతుల్లో) పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠి 22 బంతుల్లో 34 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. మార్‌క్రమ్ 27 బంతుల్లో 41, నికోలస్ పురాన్ 30 బంతుల్లో 35 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచారు.
మ్యాచ్ సాగిందిలా..
తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఎస్ఆర్హెచ్. ఇప్పటి వరకు ఆడిన ఆరింటికి.. ఆరు మ్యాచ్‌లలో టాస్ గెలిచింది ఎస్ఆర్హెచ్ కావడం గమనార్హం.
ఇక తొలుత బ్యాంటింగ్ చేసిన పంజాబ్.. ఎస్ఆర్హెచ్ బౌలర్ల దాటికి వరుస వికెట్లు సమర్పించుకుంది. లివింగ్ స్టోన్ మాత్రమే 33 బంతుల్లో 60 రన్స్ చేసి ఆకట్టుకోంగా.. మిగతా బ్యాటర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు.
ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. దీనితో 151 రన్స్ మాత్రమే చేయగలిగింది.
Also read: KL Rahul: లక్నో గెలుపు.. కేఎల్ రాహుల్‌కు రూ.12 లక్షలు జరిమానా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook