MS Dhoni లేకపోతే.. నేనూ IPL ఆడను: Suresh Raina
Suresh Raina about MS Dhoni: న్యూఢిల్లీ: ఐపీఎల్ టోర్నమెంట్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తూ సీఎస్కే స్టార్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎంఎస్ ధోనీ ఐపీఎల్ (MS Dhoni in IPL) నుంచి తప్పుకున్నట్టయితే.. తాను కూడా ఐపిఎల్‌కి గుడ్ బై చెబుతా అని సురేశ్ రైనా ప్రకటించాడు.
Suresh Raina about MS Dhoni: న్యూఢిల్లీ: ఐపీఎల్ టోర్నమెంట్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తూ సీఎస్కే స్టార్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తమ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ (MS Dhoni in IPL) నుంచి తప్పుకున్నట్టయితే.. తాను కూడా ఐపిఎల్‌కి గుడ్ బై చెబుతా అని సురేశ్ రైనా వ్యాఖ్యానించాడు.
అంతేకాకుండా ఐపీఎల్ 14వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తే.. ధోనీ మరో సీజన్ ఆడే విధంగా తానే ఒప్పిస్తానని సురేష్ రైనా పేర్కొన్నాడు. 2008 నుంచి మేము ఐపిఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ (Chennai Super Kings) తరపున ఆడుతున్నాం అని చెబుతూ ఈ ఏడాది మేము గెలిస్తే.. వచ్చే ఏడాది కూడా ఆడేలా ధోనీని (MS Dhoni) నేను ఒప్పిస్తా అని అభిప్రాయపడ్డాడు.
''నాకు మరో నాలుగైదేళ్లు ఐపిఎల్ ఆడే సామర్థ్యం ఉంది. వచ్చే ఏడాది ఐపిఎల్ లీగ్‌లో (IPL) రెండు కొత్త ఫ్రాంచైజీలు కూడా యాడ్ కానున్నాయి. అయినప్పటికీ తాను చివరివరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతోనే ఆడుతానని భావిస్తున్నా'' అని సురేష్ రైనా (Suresh Raina) ధీమా వ్యక్తంచేశాడు.
Also read: Grant Flower: శ్రీలంక బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌కు కరోనా పాజిటివ్, ఐసోలేషన్‌లో టీమ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook