Grant Flower tests positive for COVID-19: ఇటీవల ఇంగ్లాండ్ టెస్టును వణికించిన కరోనా మహమ్మారి తాజాగా శ్రీలంక జట్టుపై ప్రభావం చూపుతోంది. టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు శ్రీలంక బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కరోనా బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన పీసీఆర్ టెస్టులలో గ్రాంట్ ఫ్లవర్‌కు కరోనా పాజిటివ్ అని తేలినట్లు బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ముగ్గురు ఇంగ్లాండ్ క్రికెటర్లు, నలుగురు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో దాదాపు మొత్తం జట్టును, సహాయక సిబ్బందిని ఐసోలేషన్‌లో ఉంచారు. స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించి పాక్‌తో వన్డే సిరీస్ కొనసాగిస్తున్నారు. మరోవైపు టీమిండియాతో శ్రీలంక వన్డే, టీ20 సిరీస్‌లకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో స్వల్ప లక్షణాలు కనిపించడంతో గ్రాంట్ ఫ్లవర్‌కు కరోనా టెస్టులు నిర్వహించగా కోవిడ్19 పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని లంక బోర్డు గురువారం వెల్లడించింది.
Also Read: MS Dhoni: సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు శుభవార్త, క్లారిటీ ఇచ్చిన CEO
ఇంగ్లాండ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన శ్రీలంక జట్టు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. జులై 13నుంచి టీమిండియాతో లంక టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. బయో బబుల్‌లోకి శ్రీలంక ఆటగాళ్లు వస్తారని, ఇదివరకే భారత క్రికెటర్లు పర్యటనకు వచ్చారిన ఏఎన్ఐ మీడియాతో లంక బోర్డు తెలిపింది. కాగా, ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ 2-0తో, టీ20 సిరీస్‌ను 3-0తో లంక జట్టు దారుణ పరాభవాన్ని మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో భారత్‌తో వన్డే, టీ20 సిరీస్‌లో సత్తా చాటాలని లంక ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.
Also Read: Wimbledon 2021: వింబుల్డన్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం Roger Federer కథ ముగిసింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook