SuryaKumar Yadav Becomes first Indian to achive 900 Rating Points in T20 Format: క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ పేరు మార్మోగిపోతోంది. టీ20 క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తూ.. అన్ని రకాల రికార్డులను బద్దలు కొడుతున్నాడు. తాజాగా శ్రీలంక బౌలర్లను ఊచకోత కోస్తూ.. 51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో టీ20ల్లో అత్యధిక సెంచరీలు బబాదిన రెండో భారతీయుడిగా సూర్య నిలిచాడు. మొత్తంగా టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన నాలుగో బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. తాజాగా సూర్య మరో అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో 'మిస్టర్ 360' సూర్యకుమార్‌ యాదవ్‌ 908 రేటింగ్‌ పాయింట్స్‌ ఖాతాలో వేసుకున్నాడు. దాంతో పొట్టి ఫార్మాట్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అంతేకాదు టీ20ల్లో 900 రేటింగ్ పాయింట్స్ కంటే ఎక్కువ సాధించిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఈ రికార్డు ఇంతవరకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహ్మద్ షమీ లాంటి సీనియర్లు కూడా అందుకోలేకపోయారు. 


ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ 908 రేటింగ్‌ పాయింట్స్‌ సాధించి భారత్ తరఫున మొదటి స్థానంలో ఉండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ అత్యధికంగా 897 రేటింగ్‌ పాయింట్స్‌ సాధించాడు. లోకేష్ రాహుల్ (854), యువరాజ్ సింగ్ (793), సురేష్ రైనా (776) టాప్-లో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధికంగా 718 రేటింగ్‌ పాయింట్స్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఇక టీ20 ర్యాంకింగ్స్‌ చరిత్రలో డేవిడ్‌ మలాన్‌ (915), ఆరోన్‌ ఫించ్‌ (900)లు మాత్రమే 900 రేటింగ్‌ పాయింట్స్‌ను అందుకున్నారు. 


తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ 908 రేటింగ్‌ పాయింట్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్‌ రిజ్వాన్‌ (836) రెండో స్థానంలో ఉన్నాడు. ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. డెవాన్‌ కాన్వే, బాబర్‌ ఆజమ్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌, డేవిడ్‌ మలాన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రిలీ రొస్సో, ఆరోన్‌ ఫించ్‌, అలెక్స్‌ హేల్స్‌ టాప్-10లో ఉన్నారు. విరాట్‌ కోహ్లీ (631) 13వ స్థానంలో ఉన్నాడు. సూర్య, కోహ్లీ తప్ప టాప్‌-20లో టీమిండియా తరఫున మరెవరూ లేరు. 


Also Read: Rahu Transit 2023: మేష రాశిలోకి రాహువు.. ఈ 4 రాశుల వారికి అపారమైన డబ్బు సొంతం! అస్సలు ఊహించరు  


Also Read: Best Mileage Bike: ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ! ఈ బజాజ్ స్టైలిష్ బైక్ ధర 75 వేలు మాత్రమే  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.