These 4 Zodiac Signs peoples will get Huge Money due to Rahu Vakri 2023: 2023వ సంవత్సరంలో అక్టోబర్ నెలలో మేష రాశిలోకి రాహువు ప్రవేశిస్తాడు. 2023 అక్టోబర్ వరకు వృషభ రాశిలో రాహువు ఉంటాడు. మరోవైపు కుంభ రాశిలో శని సంచారం కారణంగా.. రాహువు మరియు శని ఒకరికొకరు కేంద్ర స్థానంలో ఉంటారు. రాహువు మరియు శని ప్రభావం కారణంగా.. రాహువు ఉన్న వృషభ రాశి మరియు శని ఉన్న కుంభ రాశి వారికి విశేష ప్రయోజనాలు లభిస్తాయి. వృషభ, కుంభ రాశుల వారికి మాత్రమే కాకుండా రాహువు మరో రెండు రాశుల వారికి కూడా ఆకస్మిక ప్రయోజనాలను ఇస్తుంది.
మిథున రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిరోగమన దిశలో కదులుతున్న రాహువు.. మిథున రాశి వారి జాతకంలో 11వ ఇంట్లో సంచరించబోతున్నాడు. దాంతో ఈ రాశి వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అదే సమయంలో పెద్ద ఖర్చులు కూడా వస్తాయి. అయితే డబ్బు రాక కారణంగా బ్యాలెన్స్ అవుతుంది. వ్యాపారంలో వృద్ధికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారి జాతకంలో 10వ ఇంట్లో రాహు సంచారం జరగబోతోంది. దాంతో కుటుంబ జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. ఖర్చు పెరుగుతుంది. అయితే ఆకస్మిక డబ్బు రాక దానిని భర్తీ చేస్తుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మిత్రులు, బంధువుల సహకారం ఉంటుంది.
వృశ్చిక రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు సంచారం వృశ్చిక రాశి వారి జాతకంలో ఆరవ ఇంట్లో జరగబోతోంది. రాహు సంచారం వల్ల మనోబలం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా ఉంటుంది. కెరీర్‌కు సంబంధించి మీరు వెతుకుతున్న అవకాశాలు ఇప్పుడు దొరుకుతాయి. స్నేహితులు మరియు బంధువులను కలుస్తారు.
కుంభ రాశి:
కుంభ రాశి వారి మూడవ ఇంటిలో రాహు సంచరించబోతున్నాడు. ఇది ఈ రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో రిస్క్ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కెరీర్‌కు అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వారికి అవకాశం లభిస్తుంది. విదేశాలతో సంబంధం ఉన్న వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. అయితే వివాదాలకు దూరంగా ఉండండి.
Also Read: Best Mileage Bike: ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ! ఈ బజాజ్ స్టైలిష్ బైక్ ధర 75 వేలు మాత్రమే
Also Read: Saturn Transit 2023: శతభిషా నక్షత్రంలోకి శని గ్రహం.. ఈ 3 రాశుల వారికి ఆకస్మిక ధనలాభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.