Sania Mirza Supports Pakistan: సానియా మీర్జా భారత పౌరసత్వాన్ని రద్దు చేయండి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
గురువారం జరిగిన పాకిస్తాన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సానియా మీర్జా మద్దతు తెలిపినందుకు భారత్ అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో సానియా మిర్జాపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
Sania Mirza Supports Pakisthan in World Cup Semi Finals: భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) కు పెళ్లి జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే! పెళ్లి అయ్యాక కూడా.. సానియా మిర్జా ఇండియా తరపునే ఆడటం కూడా మనకు తెలిసిందే. నిజానికి సానియా మీర్జా సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ సారి కూడా అలానే జరిగింది.
గురువారం దుబాయ్ (Dubai) లో టీ 20 ప్రపంచ కప్ (T 20 World Cup 2021) లో భాగంగా పాకిస్తాన్ - ఆస్ట్రేలియా (Pakistan Vs Australia) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.. అందులో పాకిస్తాన్ ఓడిన సంగతి కూడా తెలిసిందే! కాకపొతే గురువారం జరిగిన మ్యాచ్ లో సానియా మీర్జా స్టేడియంలో కనపడింది. అంతేకాకుండా, మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ టీమ్ కు సపోర్ట్ చేస్తూ కనపడింది. భర్త షోయబ్ మాలిక్ (Shoaib Malik) బ్యాటింగ్ లో విఫలమైన భారీ స్కోర్ చేసిన పాకిస్తానీ క్రికెటర్లకు మద్దతు తెలపటం... కొంత మంది అభిమానులకు నచ్చలేదు.
Also Read: Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!
దీంతో సోషల్ మీడియాలో సానియా మీర్జాపై తెగ ట్రోలింగ్ జరుగుతుంది. భారత్ (India) తరపున టెన్నిస్ లో ఆడుతూ, పాకిస్తాన్ ఆటగాళ్లకు సపోర్ట్ చేయటం ఏంటీ అని కొంత మంది అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. టీమిండియా (Team India) ఆడిన ఒక్క మ్యాచ్ లో కనపడని సానియా... కేవలం పాకిస్తాన్ మ్యాచ్ లో కనపడి.... వారికి మద్దతు తెలపడంపై అభిమానుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది.
భారత దేశ పౌరసత్వాన్ని కలిగి ఉండి.. పాకిస్తాన్ (Pakistan) కు సపోర్ట్ చేయటమేంటి.. వెంటనే భారత్ పౌరసత్వాన్ని రద్దు చేసి.. పాకిస్తాన్ పౌరసత్వాన్ని ఇవ్వండి... అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపై సానియా మీర్జా భారత్ తరపున టెన్నిస్ ఆడాల్సిన అవసరం లేదంటూ నెటిజన్లు ఆగ్రహానికి గురవుతున్నారు.
Also Read: Mega Collaboration: చిరు-సల్మాన్ చిందేయనున్న పాట కోసం 'బ్రిట్నీ స్పియర్స్'..??
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి