Mega Collaboration: చిరు-సల్మాన్ చిందేయనున్న పాట కోసం 'బ్రిట్నీ స్పియర్స్‌'..??

ఇన్ని రోజులు అభిమానులను ఊరిస్తున్న వార్త నిజమేనని థమన్ తెలిపారు. చిరు-సల్మాన్ కలిసి గాడ్ ఫాథర్ సినిమాలో కలిసి డ్యాన్స్ చేయనున్నారని... ఈ పాట కోసం బ్రిట్నీ స్పియర్స్‌తో పాడించనున్నట్లు స్పష్టం చేశారు...   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2021, 10:44 AM IST
  • హుర్రే.. చిరు-సల్మాన్ ఒకే పాటలో డ్యాన్స్ చేయబోతున్నారు
  • విషయాన్ని కన్ఫార్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్
  • ఈ పాట కోసం బ్రిట్నీ స్పియర్ ను పాడించనున్నట్లు సమాచారం
Mega Collaboration: చిరు-సల్మాన్ చిందేయనున్న పాట కోసం 'బ్రిట్నీ స్పియర్స్‌'..??

Salman Khan, Chiranjeevi's Dance in 'Godfather': ఒకరి టాలీవుడ్ మాస్ మెగాస్టార్ (Tollywood Megastar)... మరొకరు బాలీవుడ్ మాస్ కా భాయ్ సల్మాన్ ఖాన్ (Bollywood Salman Khan)... ఇద్దరు ఒకే స్క్రీన్ పై కనపడితే... ఇంకేం ఉంది అభిమానులకు పండగే.. అయితే గత కొంత కాలంగా చిరంజీవి నటిస్తున్న "గాడ్ ఫాథర్" సినిమాలో సల్మాన్ ఖాన్ (Salman Khan) తో కలిసి ఒక పాటలో డ్యాన్స్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతన్న సంగతి మన అందరికి తెలిసిందే...!!

అయితే ఈ వార్త గురించి చిత్ర బృందం కానీ, నటీ నటీమణుల నుండి ఎలాంటి సమాచారం అందలేదు. కానీ, 'గాడ్ ఫాథర్' (God Father) సినిమాకి స్వరాలు అందిస్తున్న థమన్ ఈ వార్త నిజమేనని తెలిపారు. అంతేకాకూండా ఈ పాట కూడా పాప్ సింగర్ బ్రిట్నీ (Britney) పాడతారా? అన్న విషయంపైన కూడా ఒక స్పష్టతనిచ్చారు. 

Also Read: Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!

ఒక ఇంటర్వ్యూలో తమన్ (Thaman) మాట్లాడుతూ.. "బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి కలిసి డ్యాన్స్ చేయటం అనేది చాలా గొప్ప విషయం..అందుకే ఈ పాట కూడా గొప్పగా ఉండాలని ప్లాన్ చేస్తున్నాము. అందుకోసమే ఒక ఇంటర్నేషనల్ సింగర్ ను తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాము" అని తమన్ చెప్పటంతో చిరు, సల్మాన్ కలిసి ఒక పాటలో డ్యాన్స్ చేయబోతున్నారని దాదాపు ఖారారు అయిపొయింది. 

అంతేకాకూండా.. విదేశీ ఆర్టిస్టులకు కొన్ని అంతర్జాతీయ ఆడియో కంపెనీలతో మంచి అనుబంధాలు ఉన్నాయని.. వారి ద్వారా  ఒప్పందాలు కుదుర్చుకుంటామని థమన్ తెలిపారు. బ్రిట్నీతో తెలుగులో పాడించాలా లేక... ఇంగ్లీష్ పాట పాడించాలా అన్న సంగతి ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. బ్రిట్నీ స్పియర్స్‌ (Britney Spears) ని కలిసే ముందే అన్ని రకాలుగా సిద్దమై.. మంచి ప్లాన్ తో ముందుకు వెళ్తామని థమన్ తెలిపారు. 

Also Read: Kangana Ranaut: 'దేశానికి స్వాతంత్ర్యం 2014లో వచ్చింది' కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు

మోహన్ లాల్ (Mohan Lal) నటించిన 'లూసిఫర్' (Lucifer) సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఈ సినిమానే తెలుగులో 'గాడ్ ఫాథర్' (God Father) పేరుతో రీమేక్ చేస్తుండగా.. మోహాన్ లాల్ పాత్రను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వం వహిస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News