IND vs WI: రేపటి నుంచి భారత్, విండీస్‌ మధ్య టీ20 సిరీస్‌ అలరించనుంది. ట్రిన్ డాడ్ వేదికగా రాత్రి 8 గంటలకు తొలి టీ20 జరగనుంది. రోహిత్ శర్మ సారధ్యంలో భారత్ ఆడనుంది. ఇప్పటికే జట్టు సభ్యులను బీసీసీఐ ప్రకటించింది. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని టీమిండియా ఊపు మీద ఉంది. అదే స్ఫూర్తితో ఐదు టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని యోచిస్తోంది. రోహిత్ శర్మ రాకతో జట్టుకు బలం చేకూరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీనియర్లు, జూనియర్లతో టీమ్ సమంగా ఉంది. మరో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. వన్డే సిరీస్‌లో శ్రేయర్ అయ్యర్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్‌ టచ్‌లోకి రావడంతో భారత్‌కు కలిసి రానుంది. దినేష్ కార్తిక్, రిషబ్ పంత్, పాండ్యతో మిడిల్ ఆర్డర్ బలంగా ఉంది. అక్షర్ పటేల్, అశ్విన్‌తో ఆల్‌రౌండర్లు సైతం అందుబాటులో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్, అవేష్ ఖాన్, హర్షల్‌ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్, రవి బిష్ణోయ్ ఉన్నారు.


ఇందులో ముగ్గురు బౌలర్లకు జట్టులో స్థానం దక్కనుంది. మొత్తంగా అన్ని విభాగాల్లో టీమిండియా స్ట్రాంగ్‌గా ఉంది. ఇటు టీ20ల్లో విండీస్‌ను తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే అత్యధిక సార్లు టీ20 వరల్డ్ కప్‌ను ఆ జట్టు సాధించింది. అందుకే భారత్‌కు కఠిన సవాల్ తప్పదని క్రికెట్ పండితులు చెబుతున్నారు. బౌలింగ్‌తోనే కరేబియన్ జట్టును దెబ్బ కొట్టాలని సూచిస్తున్నారు. ఏదిఏమైన రేపటి నుంచి టీ20 సిరీస్‌ రసవత్తరంగా సాగనుంది.


టీమిండియా జట్టు..


రోహిత్ శర్మ, పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దినేష్ కార్తీక్, పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్, అవేష్‌ ఖాన్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్
 




 


Also read:Goa Zuari River  Accident: గోవాలో నదిలోకి దూసుకెళ్లిన కారు..నలుగురు జల సమాధి..!


Also read:ICC ODI Rankings: ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా జైత్రయాత్ర..వన్డే ర్యాంకింగ్స్‌లో సూపర్ షో..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook