T20 World Cup 2021: వార్నర్ విశ్వరూపం..విండీస్ పై ఆసీస్ ఘన విజయం
T20 World Cup 2021: వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో గ్రూప్-1 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరడమే కాకుండా..నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకుంది.
T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా.. వెస్టిండీస్(West Indies)తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆసీస్(Australia) సత్తా చాటింది.
టాస్ ఓడి మెుదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. పొలార్డ్(44), లూయిస్ (29), హెట్మెయిర్ (27), రస్సెల్ (18*) రాణించారు. క్రిస్ గేల్ 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆఖరి మ్యాచ్ ఆడుతున్న డ్వేన్ బ్రావో (10) ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లోనూ విఫలమయ్యాడు. ఆసీస్ బౌలర్ హేజిల్‌వుడ్ (4/39) కరేబియన్ జట్టును దెబ్బతీశాడు.
Also read:T20 WC 2021 India vs Scotland: టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన...స్కాట్లాండ్పై భారత్ గెలుపు
అనంతరం ఆసీస్ 16.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 161 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. డేవిడ్ వార్నర్ (89*), మిచెల్ మార్ష్ (53) అర్ధశతకాల చెలరేగి ఆడారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు శతకం (122) పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విండీస్ బౌలర్లలో అకీల్, గేల్ చెరో వికెట్ తీశారు. దీంతో పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ (8 పాయింట్లు: +3.183 రన్‌రేట్), ఆసీస్ (8), దక్షిణాఫ్రికా (6) వరుస స్థానాల్లో నిలిచాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి