T20 World Cup 2021: శ్రీలంక పేసర్ అనగానే గుర్తొచ్చే ఆటగాళ్లలో లసిత్ మలింగ ఒకడు. జట్టుకు అద్భుత విజయాలు అందించిన యార్కర్ స్పెషలిస్ట్ మలింగ జాతీయ జట్టుతో చేరనున్నాడు. టీ20 ప్రపంచ కప్ లక్ష్యంగా ఉన్న లంక జాతీయ జట్టు మలింగ సేవలు అవసరమని భావిస్తోంది. మలింగ త్వరలో జాతీయ జట్టుతో చేరనున్నాడని శ్రీలంక సెలక్షన్ కమిటీ చైర్మన్ ప్రమోద్య విక్రమసింఘే తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన లసిత్ మలింగ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 122 మ్యాచ్‌లలో 170 వికెట్లు పడగొట్టాడు. త్వరలో జరగనున్న టీ20 సిరీస్‌లు, టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో మలింగతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. అక్టోబర్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌తో పాటు 2023లో నిర్వహించనున్న వన్డే ప్రపంచ కప్ కోసం జట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదివరకే వన్డే క్రికెట్‌కు మలింగ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ 2021(IPL 2021 )కు ముందు ముంబై ఇండియన్స్ మలింగను వదులుకుంది. 


Also Read: COVID-19 విషాదం, కరోనాతో టీమిండియా క్రికెటర్ Piyush Chawla తండ్రి కన్నుమూత


2021, 2022లో వరుస టీ20 వరల్డ్ కప్‌లు జరగనున్నాయిని, మలింగ లాంటి బౌలర్ లంక బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించాలని భావిస్తున్నట్లు విక్రమసింఘే తెలిపారు. ఈ నేపథ్యంలో లంక జట్టు అనగానే మలింగ పేరును తాము కచ్చితంగా పరిశీలిస్తామన్నారు. లంక జాతీయ జట్టులో మలింగ(Lasith Malinga) గొప్ప బౌలర్ అని, అతడి రికార్డులే ఆటగాడి గురించి చెబుతాయని పేర్కొన్నాడు. త్వరలోనే లంక సెలక్టర్లను కలిసి మాట్లాడతానని మలింగ సైతం స్పందించాడు.


Also Read: IPL 2021: ఆస్ట్రేలియా క్రికెటర్లకు టీ20 లీగ్స్‌పై జాతీయ బోర్డు కీలక సూచనలు, ఆదేశాలు


‘నేను టెస్టు, వన్డే క్రికెట్‌ ఫార్మాట్లకు వీడ్కోలు పలికాను. అయితే టీ20లలో మాత్రం కొనసాగుతున్నాను. టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో సెలక్షన్ కమిటీ నా లాంటి సీనియర్ ఆటగాళ్ల సేవలు కోరుకుంటుందని తెలుసు. కెరీర్‌లో పలు సందర్బాలలో నేనేంటో నిరూపించుకున్నాను. చాలా కాలం తరువాత జాతీయ జట్టుకు ఆడబోతున్నాను. అందుకు సిద్ధంగా ఉన్నానని’ శ్రీలంక పేసర్ లసిత్ మలింగ తెలిపాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook