Trolls on Team India: పెట్రోల్ ధర కన్నా టీమిండియా స్కోర్ తక్కువ.. ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్
రెండు కీలక మ్యాచ్ లలో పరాజయం పొందిన టీమిండియా జట్టు పై అభిమానులు ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. వాటిలో కొన్ని మీరే చూడండి
Trolls on Team India: ఆదివారం న్యూజిలాండ్ (New Zealand) జట్టుతో జరిగిన కీలక మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాభావాన్ని మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. రెండు ఓటములతో అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. టైటిల్ ఫెవరెట్ గా ప్రపంచకప్ లోకి దిగిన భారత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan) తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చవి చూసింది.
ఆటలో గెలుపు ఓటములు సాధారణమే కదా అని అభిమానులు అనుకున్నారు. పాకిస్తాన్ తో ఓడిన తరువాత విరాట్ కోహ్లీ (Virat Kohli) ఏమన్నారంటే.. " ఇది టోర్నీలో మొదటి మ్యాచ్ మాత్రమే.. ఇంకా టోర్నమెంట్ అయిపోలేదు అన్నాడు". దీనికి అభిమానులు కూడా మద్దతు తెలిపారు..
Also Read: RRR Movie Glimpse: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి గ్లింప్స్ వచ్చేసింది.. వీడియో ఎలా ఉందంటే?
కానీ న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్ లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ మాత్రం పోరాట ప్రతిమ చూపని భారత్ ఆటగాళ్ల పై తీవ్ర విమర్శలతో పాటు అభిమానులు ట్రోల్స్ (Trolls) చేస్తున్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు.. వచ్చామా..?? షార్ట్ ఆడమా..?? అవుటయ్యామా..?? వెళ్లిపోయామా..?? అన్న విధంగా ఆడటం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి ఏ ఒక్క ఆటగాడిలో కూడా మ్యాచ్ గెలవాలన్న పట్టుదల అసలు కనపడకపోవటం గమనార్హం..
7 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసిన భారత్ స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ జట్టు ముందు ఉంచింది. న్యూజిలాండ్ టీమ్ రెండు వికెట్లు కోల్పోయి.. 14.3 ఓవర్లలోనే అలవోకగా లక్ష్యాన్ని చేసింది విజయం సాధించారు.
అయితే ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేని అభిమానులు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. కోహ్లీ, మెంటర్ ధోని (MS Dhoni), రవిశాస్త్రి (Ravi shastri).. ఎవరిని ఓదలిపెట్టకుండా ట్రోల్స్ చేస్తున్నారు. టీమిండియా స్కోర్ పెట్రోల్ ధర కంటే తక్కువని, ఐపీఎల్ బాగా ఆడే ఆటగాళ్లు ప్రపంచకప్ లో ఎందుకు ఆడటం లేదండి ట్రోల్స్ తో సోషల్ మీడియా నిడిపోయింది.
Also Read: Commercial LPG Price Today: కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్పై రూ.266 పెంపు.. రూ.2000లకు చేరిన సిలిండర్ ధర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook