India Team T20 World Cup Semifinal Scenarios: టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఐదు వికెట్ల తేడాతో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో గ్రూప్‌-బిలో టాప్‌ ప్లేస్‌లో ఉన్న భారత్.. పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి పడిపోయింది. మూడు మ్యాచ్‌లో రెండు విజయాలతో సౌతాఫ్రికా 5 పాయింట్లతో మొదటి ప్లేస్‌లోకి వచ్చేసింది. భారత్ ఖాతాలో ప్రస్తుతం నాలుగు పాయింట్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి తరువాత గ్రూప్‌-బిలో సమీకరణలు మొత్తం మారిపోయాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెంబా బావుమా సేన సెమీఫైనల్‌కు చేరుకోవడం దాదాపు ఖాయం. ప్రస్తుతం ప్రోటీస్ ఖాతాలో 5 పాయింట్లతో పాటు 2.772 నెట్ రన్ రేట్ కూడా మెరుగ్గా ఉంది. ఆ జట్టు పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లలో ఒకటి గెలిచినా.. దక్షిణాఫ్రికా ఏడు పాయింట్లతో సెమీ ఫైనల్‌లో  బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది. బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు తమ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. అవి వరుసగా ఎనిమిది, ఏడు పాయింట్లు సాధిస్తాయి. అయినా దక్షిణాఫ్రికా నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో సెమీస్‌ ప్లేస్ దాదాపు గ్యారంటీ. 


సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత అందరి దృష్టి టీమ్ ఇండియాపైనే ఉంది. భారత్ సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే ఆఖరి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ బంగ్లాదేశ్‌ను ఓడించి, జింబాబ్వే చేతిలో ఓడిపోతే.. జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్లు ఏడు లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లతో సెమీ ఫైనల్లో అడుగుపెడతాయి. ఇక బుధవారం బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుండగా.. వర్షం పడే అవకాశం 70 శాతం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో టీమిండియా అభిమానుల్లో కలవరం మొదలైంది. 


షకీబ్ అల్ హసన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి భారత్‌తో సమానంగా 4 పాయింట్లు సాధించింది. అయితే నెట్ రన్ రేట్ (-1.533) విషయంలో మాత్రం వెనుక ఉంది. ఆ టీమ్ భారత్, పాకిస్తాన్‌లతో మ్యాచ్‌లు ఆడలేదు. బంగ్లా రేసులో నిలవాలంటే కనీసం ఒక జట్టుపై అయినా గెలవాలి. రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే ఎనిమిది పాయింట్లు సాధించి మిగతా జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా సెమీఫైనల్‌లో చోటు దక్కించుకుంటుంది.


అటు పాకిస్థాన్ జట్టు కూడా సెమీ ఫైనల్‌ రేసులోనే ఉంది. అయితే అది చాలా కష్టమైన పని. ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన పాక్.. 2 పాయింట్లు సాధించింది. నెట్ రన్ రేట్ 0.765గా ఉంది. భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం పాకిస్థాన్ అవకాశాలను దెబ్బతీసింది. మరో రెండు మ్యాచ్‌లు ఆడనున్న పాకిస్థాన్.. రెండు గెలిచినా ఆరు పాయింట్లు మాత్రమే చేయగలదు. దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్‌ను ఓడిస్తే.. ఆ జట్టు ఖాతాలో ఏడు పాయింట్లు ఉంటాయి. భారత్ తన మిగిలిన రెండు గేమ్‌లలో ఒకదానిని కోల్పోయి.. ఆరు పరుగులతో ముగిస్తే.. అప్పుడు పాక్‌తో పాటు పోటీ పడుతుంది. రెండు జట్లలో మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్లు సెమీస్‌కు చేరుతుంది. 


మరోవైపు జింబాబ్వేకు కూడా సెమీస్ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జింబాబ్వే ఖాతాలో మూడు మ్యాచ్‌ల నుంచి 3 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. నెట్ రన్ రేట్ -0.050గా ఉంది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే జింబాబ్వే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. ఆ జట్టు నెదర్లాండ్స్‌, భారత్‌ను ఓడిస్తే సెమీస్‌ చేరుతుంది. రెండు ఒకటి ఓడినా ఇంటికే. ఇక నెదర్లాండ్స్ ఇంకా ఖాతా తెరవకపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.


Also Read: Hyderabad Metro Charges: మెట్రో రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. పెరగనున్న ఛార్జీలు  


Also Read: India T20 World Cup: టీమిండియా ఓటమికి అసలు కారణం చెప్పిన రోహిత్ శర్మ.. చేసిన తప్పులు ఇవే..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook