టీ20 ప్రపంచకప్ 2022లో ప్రత్యర్ది దేశాల తొలి మ్యాచ్ రేపు అక్టోబర్ 23న జరగనుంది. క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ విషయంలో పాకిస్తాన్‌కు ముందే షాక్ తగిలింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత, పాకిస్తాన్ జట్ల మధ్య అక్టోబర్ 23 న మెల్‌బోర్న్ స్డేడియంలో తొలిమ్యాచ్ జరగనుంది. అందరి దృష్టి ఇదే మ్యాచ్‌పై ఉంది. టీమ్ ఇండియా అభిమానులకు మాత్రం మ్యాచ్‌కు ముందే గుడ్‌న్యూస్ అందేసింది. పాకిస్తాన్‌కు చెందిన స్టార్ ఆటగాడు ఫిట్‌నెస్ కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. 


పాకిస్తాన్ స్టార్ ఆటగాడు ఫఖర్ జమా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తొలి మ్యాచ్‌లో ఆడటం లేదని పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రకటించాడు. గత కొద్దికాలంగా గాయం కారణంగా చికిత్స పొందుతున్న ఫఖర్ ఆజమ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. పూర్తిగా ఫిట్‌నెస్ లేకపోవడంతో తొలి మ్యాచ్ ఆడటం లేదని బాబర్ చెప్పాడు. మరో స్టార్ బ్యాటర్ షాన్ మసూద్ మాత్రం తొలిమ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు.


ఫఖర్ జమా ప్రపంచంలోని మేటి ఆటగాళ్లలో ఒకడు. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియాకు ఎన్నడూ మర్చిపోలేని ఓటమిని అందించాడు ఫఖర్ జమా. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫఖర్ జమా 114 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 180 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.


ఫఖర్ జమా పాకిస్తాన్ జట్టు తరపున మూడు క్రికెట్ ఫార్మట్స్‌లో ఆడి ఉన్నాడు. కేవలం అతడి సామర్ధ్యంపై పాకిస్తాన్ చాలాసార్లు మ్యాచ్‌లు గెలిచింది. 3 టెస్ట్ మ్యాచ్‌లలో 192 పరుగులు, 62 వన్డేల్లో 2628 పరుగులు, 71 టీ20ల్లో 1349 పరుగులు సాధించాడు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఇండియాపై ఫఖర్ జమా వంటి కీలక ఆటగాడు లేకపోవడం ఆ జట్టుకు షాక్. టీమ్ ఇండియాకు లాభం.


Also read: Ind vs Pak T20 World Cup 2022: ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో ప్లేయింగ్ 11 ఎవరెవరు, మెల్‌బోర్న్ పిచ్, వాతావరణం ఎలా ఉంటుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook