Ind vs Pak T20 World Cup 2022: ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో ప్లేయింగ్ 11 ఎవరెవరు, మెల్‌బోర్న్ పిచ్, వాతావరణం ఎలా ఉంటుంది

Ind vs Pak T20 World Cup 2022: క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రేపు జరగనుంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇండియా, పాకిస్తాన్‌లు తొలి మ్యాచ్‌లోనే తలపడనున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 22, 2022, 09:41 PM IST
Ind vs Pak T20 World Cup 2022: ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో ప్లేయింగ్ 11 ఎవరెవరు, మెల్‌బోర్న్ పిచ్, వాతావరణం ఎలా ఉంటుంది

టీ20 ప్రపంచకప్ 2022 ప్రారంభమైంది. దాయాదిదేశాల మధ్య తొలి మ్యాచ్ రేపు అక్టోబర్ 23న జరగనుంది. ప్రపంచ క్రికెట్ ప్రేమికులకు ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌లో..ప్లేయింగ్ 11 ఎవరు, మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం పిచ్ ఎలా ఉందనే వివరాలు తెలుసుకుందాం..

టీమ్ ఇండియా రేపు అక్టోబర్ 23 ఆదివారం నాడు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ స్డేడియంలో తలపడనుంది. టీ20 ప్రపంచకప్ 2022లో సూపర్ 12 లో ఇండియా, పాకిస్తాన్ తొలి మ్యాచ్ ఇది. ఇప్పటికే బ్రిస్బేన్ స్డేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియాను 6 పరుగుల తేడాతో ఓడించింది. రేపు జరగనున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 ఎవరు, మెల్‌బోర్న్ వాతావరణం ఎలా ఉంటుంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉందనే వివరాలు మీ కోసం..

ఇండియా ప్లేయింగ్ 11

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్ లేదా రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చహల్, మొహమ్మద్ షమి, ఆర్షదీప్ సింహ్

పాకిస్తాన్ ప్లేయింగ్ 11

బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, షాన్ మసూద్ హైదర్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్, ఆసిఫ్ అలీ, మొహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, నసీమ్ షాహ్, హారిస్ రవూఫ్, షహీన్ షాహ్ అఫ్రిది

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పిచ్ రిపోర్ట్

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ సుప్రసిద్ధమైన స్టేడియం. ఇప్పటివరకూ ఈ పిచ్‌పై 15 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగాయి. ఛేజింగ్ టీమ్ ఈ పిచ్‌పై అత్యధికసార్లు విజయం సాధించింది. బౌండరీ లైన్ పెద్దది. డిఫెండింగ్ టీమ్‌కు కూడా అవకాశాలు ఎక్కువే ఉంటాయి. వర్షం పడే సూచనలున్నాయి. ఇరు దేశాల కెప్టెన్లు టాస్ గెలిస్తే తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశాలున్నాయి.

మెల్‌బోర్న్ వాతావరణం

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో ముందుగా అక్కడి వాతావరణం గురించి చెప్పుకోవాలి. ఇక్కడ ఉష్ణోగ్రత 20-10 డిగ్రీల మధ్య ఉంటుంది. వర్షం పడే సూచనలుండటం ఆందోళన కల్గిస్తుంది. వాతావరణశాఖ ప్రకారం ఆదివారం నాడు వర్షం పడే అవకాశాలున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఓ యుద్ధం లాంటిది. ఈ రెండు జట్లు తలపడకపోతే టోర్నమెంట్ అసంపూర్తిగా ఉంటుంది. ఆదివారం నాడు మ్యాచ్ పూర్తిగా జరుగుతుందా లేదా అనేది సందేహంగా మారింది. 

Also read: Aus Vs NZ: తొలి మ్యాచ్‌లో కంగారులకు షాక్.. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన కివీస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News