T20 World Cup 2022, Sachin Tendulkar heap praise on Suryakumar Yadav: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న టీమిండియా.. ఆ దేశ జట్టుతో తొలి వామప్ మ్యాచ్ ఆడింది. ఈ క్రమంలో సచిన్‌ టెండూల్కర్‌.. ప్రపంచకప్ 4 సెమీ-ఫైనలిస్టులను ఎంపిక పై, ఆ ఆట ఎలా ఉండబోతుందోనే విషయాన్ని అంచనా వేశాడు. అంతేకాదు భారత జట్టులో టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పై సచిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ప్రోత్సహించటం, ప్రశంసించబడటం కంటే మెరుగైన టానిక్ మరొకటి లేదు. సూర్యకుమార్‌ యాదవ్‌ గతంలో కంటే ఎంతో స్థిరంగా ఆడుతున్నాడు. విజయాలు, ప్రశంసలు కూడా అతనిని వ్యక్తిగా మార్చాయి. సూర్య చాలా నమ్మకంగా ఆడుతున్నాడు. అతడిని ఎంపిక చేయడం గురించి ఏ మాత్రం చింతించాల్సిన అవసరం లేదు' అని సచిన్‌ టెండూల్కర్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 


టీ20 మ్యాచ్‌లో సడన్‌గా నమిబియా పేరు పైకి వచ్చింది. లంకకు చుక్కలు చూపించి.. అనూహ్యంగా గెలుపొందడంపై అందరూ షాక్ అవుతున్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్-2022 అర్హత రౌండ్ లోనే లంకకు.. నమిబియా భారీ షాకిచ్చింది. గ్రూప్ ఏలో భాగంగా శ్రీలంక - నమీబియా మధ్య జరిగిన క్వాలిఫై రౌండ్ తొలి మ్యాచ్ లో.. లంకేయులకు ఓటమి తప్పలేదు. 55 పరుగుల తేడాతో నమీబియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. నమీబియాను ఉద్దేశిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇప్పుడది చర్చనీయాంశం అయింది. మ్యాచ్ తర్వాత సచిన్ తన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. 'ఈరోజు నమీబియా క్రికెట్ ప్రపంచానికి తన పేరు గుర్తుంచుకోమని ఘనంగా చాటి చెప్పింది (నామ్ యాద్ రఖ్నా)' అని ట్వీట్ చేశాడు. 


Also Read: Renu Desai Divorce : భరణంపై రేణూ దేశాయ్ అలా.. పవర్ స్టార్ ఇలా


Also Read: Catching King Kobra : బుసలు కొడుతున్న కింగ్ కోబ్రా.. చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook