T20 World Cup 2022: 2007 తర్వాత ఇదే మొదటిసారి.. టీ20 ప్రపంచకప్ 2022లో భారత్, పాకిస్తాన్ మధ్య మరో మ్యాచ్?
India and Pakistan Teams reach Semi Final in T20 World Cup after 15 Years. చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్తాన్ సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టడం 2007 తరువాత ఇదే తొలిసారి.
Is India vs Pakistan Clash again In T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో పసికూన నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించడంతో గ్రూప్ 2 సెమీస్ బెర్తులు తారుమారు అయ్యాయి. కచ్చితంగా సెమీస్ చేరుతుందనుకున్న దక్షిణాఫ్రికా మెగా టోర్నీ నుంచి అనూహ్యంగా నిష్క్రమించడంతో.. భారత్ ఎలాంటి సమీకరణాలు లేకుండా మరో మ్యాచ్ మిగిలుండగానే సెమీస్ చేరింది. అదే సమయంలో బంగ్లాదేశ్ జట్టుపై గెలిచిన పాకిస్తాన్ సెమీస్‌కు అర్హత సాధించింది. గ్రూప్ 2 నుంచి దాయాదులు పాకిస్తాన్, భారత్ సెమీస్‌కు దూసుకెళ్లాయి.
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్తాన్ సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టడం 2007 తరువాత ఇదే తొలిసారి. గతంలో భారత్, పాక్ జట్లు వేర్వేరుగా సెమీస్ చేరాయి. 15 సంవత్సరాల తర్వాత ఒకేసారి సెమీస్‌కు ఎంట్రీ ఇవ్వడం ఇదే తొలిసారి. టీ20 ప్రపంచకప్ 2022 సెమీ ఫైనల్స్‌లో న్యూజీలాండ్‌తో పాకిస్తాన్.. ఇంగ్లండ్‌తో భారత్ తలపడనున్నాయి. సెమీస్ మ్యాచులు నవంబర్ 9, 10న జరుగుతాయి. సెమీస్‌లో గనక భారత్, పాక్ జట్లు తమ ప్రత్యర్థులను ఓడిస్తే ఫైనల్స్ చేరుతాయి. అప్పుడు దాయాదులు మరోసారి తలపడే అవకాశాలు ఉన్నాయి.
2007లో తొలిసారిగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మొదటి పొట్టి టోర్నీలో భారత్, పాకిస్తాన్ ఫైనల్స్‌లో తలపడ్డాయి. హోరాహోరీగా జరిగిన పోరులో భారత్ 4 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఓడిన పాకిస్తాన్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్లీ దాయాది జట్లు టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పోరాడే అవకాశం ఉంది. 2007 నాటి రిజల్ట్ మళ్లీ రిపీట్ అవుతుందా? లేదో చూడాలి. భారత్, పాక్ ఫైనల్ ఆడాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
Also Read: కార్తీక పౌర్ణమినాడే చంద్రగ్రహణం.. హైదరాబాద్‌లో టైమింగ్స్! సూతకాలంలో చేయకూడని పనులు ఇవే
Also Read: Virat Kohli: ఆ లక్షణాలే.. విరాట్ కోహ్లీ సక్సెస్‌కు కారణం: శిఖర్ ధావన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి