T20 World Cup 2022: పాకిస్తాన్‌పై విజయానంతరం పాయింట్ల పట్టికలో ఇండియా, ఇతర దేశాల స్థానం
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022 లో టీమ్ ఇండియా బోణీ చేసింది. పాకిస్తాన్‌పై విజయం తరువాత పాయింట్ల పట్టికలో ఇండియా స్థానం ఇలా ఉంది. ఆ వివరాలు మీ కోసం..
టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో పాకిస్తాన్, ఇండియాలు తొలి మ్యాచ్‌లోనే తలపడటం అందరికీ ఆసక్తి రేపింది. పాకిస్తాన్‌పై సాధించిన విజయంతో టీమ్ ఇండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
టీ20 ప్రపంచకప్‌లో మొత్తం రెండు గ్రూపులు ఉన్నాయి. గ్రూప్ 1లో న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా దేశాలుంటే..గ్రూప్ 2లో ఇండియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, జింబాబ్వే, పాకిస్తాన్ దేశాలున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌తో కలిపి ఇప్పటివరకూ నాలుగు సూపర్ 12 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. గ్రూప్ 1లో మూడు, గ్రూప్ 2లో ఒక సూపర్ 12 మ్యాచ్ జరిగాయి. పాకిస్తాన్‌పై సాధించిన విజయంతో టీమ్ ఇండియా గ్రూప్ 2లో మొదటి స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ మాత్రం చివరి స్థానంలో నిలిచింది.
గ్రూప్ 1 విషయంలో న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. అటు ఇంగ్లండ్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌ను మట్టికరిపించింది. శ్రీలంక జట్టు ఐర్లాండ్‌పై విజయం సాధించింది. నెట్ రన్‌రేట్ ఆధారంగా గ్రూప్ 1లో న్యూజిలాండ్ జట్టు మొదటి స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లండ్, ఆప్ఘనిస్తాన్ దేశాలు ఒక్కొక్క మ్యాచ్ విజయంతో రెండేసి పాయింట్లు దక్కించుకున్నాయి. గ్రూప్ 2లో మాత్రం ఇప్పటివరకూ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ మాత్రమే జరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook