T20 World Cup Final 2024: బార్బడోస్ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ ఇవాళ జూన్ 29న ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. ఈ నేపధ్యంలో పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంటుంది ఇతర వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ ఇవాళ్టితో ముగియనుంది. 20 దేశాలు తలపడిన టోర్నీలో ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. బార్బడోస్ వేదికగా ఇవాళ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇవాళ్టి మ్యాచ్‌కు వాతావరణం సహకరించే పరిస్థితి లేదు. కానీ రేపు రిజర్వ్ ఉండటం కాస్త ఆశాజనకమైన పరిణామం. 


బార్బడోస్ పిచ్ రిపోర్ట్


బార్బడోస్ వికెట్ బ్యాటింగ్ అనుకూలమైందిగా ఉండవచ్చని అంచనా. సరాసరి 167 పరుగులు నమోదవుతుంటాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు దాదాపుగా 184 పరుగులు చేస్తుంటుంది. టీ20 ప్రపంచకప్ 2024లో ఈ పిచ్‌పై మొదటి ఇన్నింగ్స్‌లో సరాసరి స్కోరు 150 పరుగులు.పేసర్లకు కూడా మంచి అనుకూలమైన వికెట్ ఇది. ఈ పిచ్‌పై పేసర్లు 145 వికెట్లు పడగొడితే స్పిన్నర్లు 99 వికెట్లు దక్కించుకున్నారు. 


ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా హెడ్ టు హెడ్ రికార్డులు


ఈ రెండు జట్ల జయపజయాలు చూస్తే మొత్తం 26 మ్యాచ్‌లు జరిగితే దక్షిణాఫ్రికా 11 మ్యాచ్‌లలో విజయం సాధిస్తే ఇండియా 14 మ్యాచ్‌లతో ఆధిక్యంలో ఉంది. టీ 20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా రెండింట గెలిస్తే టీమ్ ఇండియా నాలుగింట విజయం సాధించింది. 


టీమ్ ఇండియా డ్రీమ్ 11 ప్రెడిక్షన్


రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బూమ్రా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే


దక్షిణాఫ్రికా డ్రీమ్ 11 ప్రెడిక్షన్


క్వింటన్ డి కాక్, రేజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, రబడ, నోర్త్జే, తబ్రేజ్ షమ్సి


Also read: Security Bonds Auction: వారంలో రెండోసారి, హామీల అమలుకు 7 వేల కోట్ల బాండ్ల అమ్మకాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook