IND Vs ENG Semifinal Highlights: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అన్ని రంగాల్లో రోహిత్ సేన అదరగొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (57), సూర్యకుమార్ యాదవ్ (47) రాణించగా.. హార్థిక్ పాండ్యా (23) పర్వాలేదనిపించాడు. అనంతరం ఇంగ్లాండ్‌ను 103 పరుగులకే ఆలౌట్ చేశారు. ముఖ్యంగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ను భరతం పట్టారు. చెరో మూడు వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీరోల్ పోషించారు. బుమ్రా రెండు వికెట్లు తీశాడు. ఈ విజయంతో 2022 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికాను భారత్ ఢీకొట్టనుంది. ఈ సారి కప్ నెగ్గితే.. ధోని తర్వాత పొట్టి క్రికెట్ కప్ లో గెలిచిన రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. ఈ సారి ఫైనల్ మ్యాచ్ పై భారత్ సహా ప్రపంచ దేశాలతో పాటు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు బౌలర్లు చుక్కలు చూపించారు. జోస్ బట్లర్ (23) నాలుగు బౌండరీలతో దూకుడు ప్రదర్శించినా.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (5)ను బుమ్రా పెవిలియన్‌కు పంపించాడు. మొయిన్ అలీ (8), బెయిర్ స్టో (0)ను ఔట్ చేసి అక్షర్ పటేల్ దెబ్బ తీయగా.. హ్యరీ బ్రూక్ (25), సామ్ కర్రాన్ (2), క్రిస్ జోర్డాన్ (1) వికెట్లను కుల్దీప్ యాదవ్ పడగొట్టి భారత్ విజయాన్ని ఖాయం చేశారు. చివరకు ఇంగ్లాండ్ 10౩ పరుగులకే కుప్పకూలింది.


అంతకుముందు టాస్ ఓడి భారత్ బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ (39 బంతుల్లో 57, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మరో హాఫ్ సెంచరీ బాదగా.. విరాట్ కోహ్లీ (9), రిషబ్ పంత్ (4) విఫలమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హార్థిక్ పాండ్యా (23), రవీంద్ర జడేజా (17 నాటౌట్) దూకుడుగా ఆడారు. శివమ్ దూబే డకౌట్ అవ్వగా.. అక్షర్ పటేల్ పది పరుగులు చేశాడు. 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోర్డాన్ మూడు వికెట్లు తీయగా.. మిగిలిన బౌలర్లు తలో వికెట్ తీశారు.


Also Read: Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter