T20 World Cup 2021 : హార్దిక్ పాండ్యా ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపిస్తాడు - వీరేంద్ర సెహ్వాగ్
Hardik Pandya capable of turning match one-sided : పాకిస్థాన్‌తో నేడు జరిగే మ్యాచ్‌ను ఒన్‌సైడ్‌గా మార్చే సత్తా హార్దిక్ పాండ్యాకి ఉందన్నారు. హార్దిక్ ఎటువంటి బ్యాటరో మనకు తెలుసు అన్నారు.
T20 World Cup: Hardik Pandya capable of turning match one-sided with the bat, says Virender Sehwag: టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) భాగంగా మరికొద్ది సేపట్లో దాయాదుల మధ్య పోరు సాగనుంది. ఇండియా పాకిస్థాన్ మధ్య నేడు జరగబోయే ఈ ఆసక్తికర పోరుకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (Dubai International Stadium) ఆతిధ్యం ఇవ్వబోతుంది. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.
పాకిస్థాన్‌తో నేడు జరిగే మ్యాచ్‌ను ఒన్‌సైడ్‌గా మార్చే సత్తా హార్దిక్ పాండ్యాకి (Hardik Pandya) ఉందన్నారు. 2017లో జరిగిన ట్రోఫీ ఫైనల్‌లో భారత్ ఓటమి చెందినప్పటికీ... హార్ధిక్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. చివరసారిగా 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్య 26 పరుగులతో పాటు, రెండు కీలకమైన వికెట్లు కూడా సాధించాడు.
Also Read : T20 World Cup 2021-Virat Kohli : బయో బబుల్‌లో గడపటం అంత తేలికేమీ కాదు - విరాట్ కోహ్లి
హార్దిక్ ఎటువంటి బ్యాటరో మనకు తెలుసు అన్నారు. పాండ్య మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చే సత్తా ఉన్న ఆటగాడని సెహ్వాగ్ (Sehwag) పేర్కొన్నారు. అతను అనేక సార్లు ఒంటి చేత్తో భారత్‌కు (India) విజయాలను అందించాడని సెహ్వాగ్ గుర్తు చేశారు. నేటి మ్యాచ్‌లో భారత్ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలని సెహ్వాగ్ సూచించారు.
Also Read : Shoaib Akhtar Comments:భారత ఆటగాళ్లకు నిద్రమాత్రలు ఇవ్వాలి..కోహ్లీ ఇన్‌స్టాకు దూరంగా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి