Virat Kohli Bowling Video: పొట్టి ప్రపంచ కప్ టోర్నమెంట్ (T-20 Worl Cup) దుబాయిలో (Dubai) ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వార్మప్​ మ్యాచ్​లు, క్వాలిఫర్ 12 మ్యాచ్​లు జరుగుతన్న సంగతి తెలిసిందే.. అయితే నిన్న (బుధవారం అక్టోబర్ 20 న) భారత్ - ఆస్ట్రేలియా (India Vs Australia Practice Match)తో జరిగిన వార్మప్​ మ్యాచ్​లో ఆసక్తికర సంఘటన నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎప్పుడు బ్యాట్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే విరాట్ కోహ్లీ బౌలింగ్ (Virat Kohli Bowling) వేసి అభిమానులను అలరించాడు. అవునండీ ఇది నిజం. బౌలింగ్ చేసిన కోహ్లీ వికెట్ తీయలేదు కానీ 12 పరుగులు మాత్రం సమర్పించుకున్నాడు. 


Also Read: India Crosses 1 Billion Vaccination: భళా 'భారత్'.. 100 కోట్ల టీకాల పంపిణీ పూర్తి


ఆస్ట్రేలియాతో (Australia) జరిగిన టీ20 ప్రపంచ కప్​ (T-20 Worl Cup) వార్మప్​ మ్యాచ్​లో (T20 Warm-Up Match Today) టీమ్​ఇండియా ఘనవిజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలోనే 153 పరుగుల చేసి విజయం సాధించింది. ఓపెనర్లు కేఎల్​ రాహుల్ ​(39 పరుగులు), రోహిత్​ శర్మ టీమిండియాకు అద్భుతమైన ఓపెనింగ్ ఇవ్వగా... రోహిత్​ శర్మ (60) హాఫ్​ సెంచరీ చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్​ దిగిన హార్దిక్​ పాండ్యా (14) తో కలిసి సూర్య కుమార్ ​యాదవ్​ (38) మ్యాచ్​ను పూర్తి చేశారు. అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. జడేజా ఒక వికెట్, చాహాల్ కూడా ఒక వికెట్ తీసి ఆస్ట్రేలియాను 152 పరుగుల వద్ద కట్టడి చేసారు. 


Also Read: RGV : ఏపీ నాయకులు త్వరలోనే బాక్సింగ్, కరాటే నేర్చుకోవాలి: ఆర్జీవీ





అయితే టాస్ వేసే సమయంలో భారత్ తరపున విరాట్ (Virat Kohli) వస్తాడని అందరు ఉహించగా.. రోహిత్ శర్మ (Rohit Sharma) రావటం.. జరిగిన మ్యాచ్ కు కెప్టెన్ గా కొనసాగటం ఆశ్చర్యానికి గురి చేసింది. బ్యాటింగ్ తో జవాబు చెప్పే విరాట్ బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు. అయితే ఈ వీడియోని ఐసీసీ (ICC) తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో "కెప్టెన్ రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీని బౌలింగ్ అటాక్ లోకి దింపాడు.. అవును మీరు చదివింది నిజమే అని" టాగ్ తో పోస్ట్ చేసింది. ఈ వీడియో తెగ వైరల్ అవగా..  విరాట్ బౌలింగ్ ను అందరు ఎంజాయ్ చేస్తున్నారు.. మరేందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ  చూసేయండి మరీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook