India Crosses 1 Billion Vaccination: కరోనా మహమ్మారిని (Corona Virus) అరికట్టడానికి ప్రస్తుతం ఉన్న ఒకే ఒక అస్త్రం వ్యాక్సిన్. టీకాల పంపిణీలో భారత్ నేడు కీలక దశకు చేరుకుంది. పంపిణీ లో భారత్ ఈ రోజు (గురువారం) 100 కోట్లకు చేరుకుంది.
టీకాల పంపిణీలో రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ... ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. నిజానికి చెప్పాలంటే అభివృద్ధి చెందిన ఏడు దేశాలు ఒక నెలలో ఎన్ని టీకాలు వేసాయి.. వాటి కన్నా మించిన మొత్తంలో టీకాల పంపిణీ వేసి భారత్ రికార్డు సృష్టించింది.
Also Read: Chandrababu Naidu : ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా: చంద్రబాబు
कोराना महामारी के खिलाफ देश की बड़ी उपलब्धि। देश में टीकाकरण का आंकड़ा 100 करोड़ के पार हुआ। दुनिया के सबसे बड़े टीकाकरण में अभूतपूर्व योगदान देने वाले देश के कुशल नेतृत्व, वैज्ञानिकों व स्वास्थ्य कर्मियों के समर्पण को सलाम। #VaccineCentury pic.twitter.com/4v5z9HuXAV
— MyGovIndia (@mygovindia) October 21, 2021
కరోనా మహమ్మారిని అరికట్టడానికి భారత ప్రభుత్వం జనవరి 16న టీకా పంపిణీపై ఉక్కుపాదం మోపగా.. మొదటగా కరోనా ఫ్రంట్ వారియర్స్ (Corona Front Warriors) అయిన డాక్టర్లు, పారిశుద్ద కార్మికులు మరియు ఆరోగ్య కార్యకర్తలకు టీకాల పంపిణీ చేశారు. తరువాత దశలో ఏప్రిల్ 1 వ తేదీ నుండి 45 సంవత్సరాలు పై బడిన వారికి మరియు మే 1 వ తేదీ నుండి 18 ఏళ్లు పై బడిన వారికి టీకాల పంపిణీ చేశారు.
మొదటగా కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ప్రజలు ఆసక్తి కనబరచక పోవటం మరియు వ్యాక్సినేషన్ తరువాత వచ్చే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్ లకు భయభ్రాంతులకు లోనయ్యారు. కానీ ఈ సంవత్సరం మార్చ్ నెలలో కరోనా రెండో దశ విజృంభించిన తరువాత ప్రజలు వ్యాక్సినేషన్ పై ఆసక్తి కనబరిచారు.
Congratulations India! We are 100 Crores strong against #COVID19 ! #VaccineCentury #COVIDGroundZero #TyoharonKeRangCABKeSang @PMOIndia @mansukhmandviya @ianuragthakur @DrBharatippawar @PIB_India @mygovindia @COVIDNewsByMIB @ICMRDELHI @DDNewslive @airnewsalerts pic.twitter.com/YvmnMGafIO
— Ministry of Health (@MoHFW_INDIA) October 21, 2021
గురువారం నాటికి టీకాల పంపిణీలో 100 కోట్ల మార్కును దాటిన దేశంలో.. ఎక్కువ శాతం మొదటి డోస్ (First Dose) తీసుకున్నవారే.. దాదాపు 75 శాతం మందిలో మొదటి డోస్ తీసుకోగా.. 31 శాతం మంది మాత్రమే రెండో డోస్ (Seond Dose) తీసుకున్నారు. రెండో డోస్ తీసుకొని వారి సంఖ్య అధికంగా ఉండటంతో.. దీనిపై కేంద్రం దృష్టి సారించి, ప్రణాళిక రూపొందించే పనిలో పడింది.
Also Read: India Covid Update: దేశంలో కొత్తగా 18,454 కరోనా కేసులు, 160 మరణాలు
India scripts history.
We are witnessing the triumph of Indian science, enterprise and collective spirit of 130 crore Indians.
Congrats India on crossing 100 crore vaccinations. Gratitude to our doctors, nurses and all those who worked to achieve this feat. #VaccineCentury
— Narendra Modi (@narendramodi) October 21, 2021
100 కోట్ల మైలురాయి ఎలా చేరుకుందంటే....
జనవరి 16 : టీకా పంపిణీ ప్రారంభించేసిన కేంద్ర ప్రభుత్వం
ఫిబ్రవరి 19 : కోటీ డోసులు పంపిణీ పూర్తి
ఏప్రిల్ 11 : 10 కోట్ల డోసులు పంపిణీ పూర్తి
జూన్ 12 : 25 కోట్లు డోసులు పంపిణీ పూర్తి
ఆగస్టు 6 : 50 కోట్లు డోసులు పంపిణీ పూర్తి
సెప్టెంబర్ 13 : 75 కోట్లు డోసులు పంపిణీ పూర్తి
అక్టోబర్ 21 : 100 కోట్లు డోసులు పంపిణీ పూర్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook