RGV Comments on AP Politics: దేశవ్యాప్తంగా ఏ విషయంపై మాట్లాడాలన్న ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తర్వాతే. తనదైన శైలిలో స్పందించి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు ఆర్జీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీంతో ఆయన ఏపీ రాజకీయాల(AP Politics)పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయ నాయకులు బాక్సింగ్ నేర్చుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు వర్మ గురువారం ఉదయం ట్విటర్(Twitter) వేదికగా ఏపీ రాజకీయాలపై కామెంట్స్ చేశారు.
‘‘ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతి త్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్ధం నేర్చుకోవాల్సి ఉంది’’ అని ఆర్జీవీ వ్యంగ్యంగా అన్నారు.
Also Read:Chandrababu Naidu : ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ(TDP) కేంద్ర కార్యాలయంపై అల్లరి మూకల దాడితో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడియత్నాలకు నిరసనగా బుధవారం తెదేపా బంద్(TDP Bandh) నిర్వహించింది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మరోవైపు పార్టీ శ్రేణులపై దాడులను నిరసిస్తూ గురువారం ఉదయం నుంచి 36 గంటలపాటు తెదేపా అధినేత చంద్రబాబు(TDP Chief Chandrababu) దీక్ష చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి