100 T20I wins for India: భారత పురుషుల క్రికెట్ జట్టు ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకుంది. టీ20 ఫార్మాట్‌లో 100 విజయాలు సాధించిన రెండో జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది. వెస్టిండీస్‌తో శుక్రవారం రాత్రి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచులో 8 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా భారత్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఇక్కడ విశేషం ఏంటంటే.. విండీస్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ తన జట్టు తరఫున 100వ టీ20 మ్యాచ్ ఆడాడు. అయితే పొలార్డ్‌కు ప్రత్యేకమైన మ్యాచులో విండీస్ ఓడిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్ ఇప్పటివరకు 155 టీ20 మ్యాచులు ఆడి వంద విజయాలు నమోదు చేసింది. 51 మ్యాచుల్లో పరాజయం పాలవగా.. మరో నాలుగు మ్యాచుల్లో మాత్రం ఫలితం తేలలేదు. టీ20ల్లో టీమిండియాకు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలు అత్యధిక విజయాలు అందించారు. మరోవైపు టీ20 ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా పాకిస్థాన్‌ కొనసాగుతోంది. పాక్ 189 మ్యాచుల్లో 118 విజయాలు సాధించింది. ఇక భారత్ 100వ వన్డే విజయాన్ని 1993లో దక్షిణాఫ్రికాపై, వందవ టెస్ట్ విజయం 2009లో శ్రీలంకపై నమోదు చేసింది. 


టీ20 ఫార్మాట్‌లో గెలుపు శాతం పరంగా చూస్తే.. పాకిస్తాన్ కంటే భారత్ ముందుంది. భారత్‌ విజయాల శాతం 65.23 కాగా.. పాక్‌ విజయాలు శాతం 64.4గా ఉంది. 50 కంటే ఎక్కువ టీ20 మ్యాచులు ఆడిన జట్లతో పోల్చితే.. కేవలం పసికూన అఫ్గానిస్థాన్‌ (67.97 శాతం) మాత్రమే టీమిండియా కంటే ముందుంది.



రెండో టీ20 మ్యాచులో మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హాఫ్ సెంచరీ (52) బాదడంతో కెప్టెన్‌ రోహిత్ శర్మ సరసన చేరాడు. ఇప్పటి వరకు 121 టీ20 మ్యాచులు ఆడిన రోహిత్‌ 30 సార్లు 50కి పైగా స్కోర్లను నమోదు చేశాడు. ఇందులో 26 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ 97 మ్యాచుల్లోనే 30 సార్లు 50కి పైగా స్కోర్లు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ టీ20ల్లో 3296 పరుగులతో చేశాడు. మరో 4 రన్స్ చేస్తే అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్‌ (112 మ్యాచుల్లో 3299 పరుగులు) అధిగమిస్తాడు. 121 మ్యాచుల్లో 3256 పరుగులతో రోహిత్‌  మూడో స్థానంలో ఉన్నాడు. 


Also Read: Ester Comments On Tollywood: అందుకు నో చెప్పానని ఛాన్సులు ఇవ్వలేదు.. టాలీవుడ్ హీరోలపై ఏస్తర్ సంచలన వ్యాఖ్యలు!


Also Read: AC, Fridges Offers: సమ్మర్ కంటే ముందే వచ్చిన భారీ డిస్కౌంట్స్.. ఈ ఆఫర్స్ పొతే మళ్లీ రావు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook