Rohit Sharma Injured In practice Session: టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో సెమీస్‌ పోరుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. నెట్ సెషన్‌లో ప్రాక్టీస్ రోహిత్ చేస్తుండగా.. త్రో డౌన్ స్పెషలిస్ట్ రఘు నుంచి బంతిని అందుకునే క్రమంలో రోహిత్ శర్మ మణికట్టుకు బాల్ వేగంగా తాకింది. దీంతో తీవ్ర నొప్పితో బాధపడుతూ రోహిత్ ఇబ్బంది పడ్డాడు. వెంటనే ప్రాక్టీస్‌ను ఆపేసి మధ్యలోనే వెళ్లిపోయి పక్కకు కూర్చున్నాడు. కుడి చేతికి ఐస్ ప్యాక్ పెట్టుకుని కూర్చున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దూరం నుంచి ఇతర ఆటగాళ్ల ప్రాక్టీస్‌ చూస్తు కూర్చున్నాడు. ఆ టైమ్‌లో కూడా హిట్ మ్యాన్‌ నొప్పితో బాధపడుతూనే కనిపించాడు. గాయం తీవ్రత తెలియనప్పటికీ.. కీలకమైన ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ ముందు రోహిత్ శర్మ గాయపడడం ఆందోళన కలిగిస్తోంది. రోహిత్ శర్మ గాయం తీవ్రమైతే.. కచ్చితంగా టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. కానీ  కెప్టెన్సీతోపాటు బ్యాటింగ్‌లో హిట్‌మ్యాన్ ఉంటే ప్రత్యర్థి జట్టుకు బెరుకే. 


ప్రస్తుత టీ20 ప్రపంచకప్ టోర్నీలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ హిట్ అయినా.. బ్యాట్స్‌మెన్‌గా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. పాకిస్థాన్‌తో 4, నెదర్లాండ్స్‌తో 53, సౌతాఫ్రికాతో 15 పరుగులు, బంగ్లాదేశ్‌తో 2 రన్స్, జింబాబ్వేతో 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. హిట్ మ్యాన్‌ అద్భుతంగా కెప్టెన్సీ చేస్తున్నాడని.. బ్యాట్‌తో కూడా రాణించాలని అతని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సెమీస్‌ పోరులో ఇంగ్లాండ్‌తో అదరగొట్టాలని కోరుకుంటున్నారు.
 


Also Read: Rohit Sharma: ఆందోళన కలిగిస్తున్న రోహిత్ శర్మ ఫామ్.. హిట్ మ్యాన్‌కు సునీల్ గవాస్కర్ సలహా..!


Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024లో ఆడే 12 జట్లు ఇవే.. నెదర్లాండ్స్, యూఎస్ఏ కూడా!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook