IND vs SA: స్వదేశంలో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా టీ20 సిరీస్‌లను కైవసం చేసుకుంటోంది. ఐతే డెత్ ఓవర్ల ఫోబియా ఇబ్బందిగా మారింది. కొండంత స్కోర్ చేసినా..దానిని కాపాడుకునేందుకు చెమటోర్చాల్సి వస్తోంది. ఆసియా కప్‌లో ఎలాంటి సమస్య తలెత్తిందో..నిన్నటి మ్యాచ్‌లో అదే రిపీట్ అయ్యింది. చివరకు భారత్‌కు విజయం వరించినా..అతి కష్టం మీద గెలవాల్సి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాటింగ్‌తో ఔరా అనిపించినా టీమిండియా..డెత్ ఓవర్లలో తనకు ఉన్న సమస్యను మరోసారి చూపించింది. రెండో టీ20 మ్యాచ్‌లో కేవలం 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈనేపథ్యంలో భారత బౌలింగ్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఏ జట్టు అయినా నిర్ధిష్ట పద్దతితో బౌలింగ్ చేయాలని కోరుకుంటుంది. ఇందులోభాగంగానే బౌలర్లకు స్వేచ్ఛను ఇవ్వాల్సి ఉంటుందన్నాడు. గత ఐదారు మ్యాచ్‌ల్లో డెత్‌ ఓవర్లలో తాము సరిగా బౌలింగ్ చేయలేదన్నాడు.


ఈ అంశము తమకు పెను సవాల్‌గా మారిందన్నాడు రోహిత్. ఏదిఏమైనా డెత్ ఓవర్లలో బౌలింగ్ గానీ, బ్యాటింగ్ గానీ చేయడం కష్టమని చెప్పాడు. ఆటలో గెలిచేది..ఓడేది అప్పుడే తెలుస్తుందన్నాడు. ఈఅంశం ఆందోళన చెందే విషయమని తాను చెప్పనని..కానీ తదుపరి మ్యాచ్‌ల్లో కలిసికట్టుగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశాడు. గౌహతి వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 16 పరుగులతో గెలిచింది.


మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్‌ చేసింది. నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన 237 పరుగులు చేసింది. టాప్‌ ఆర్డర్ మొత్తం అద్భుత బ్యాటింగ్ చేసింది. టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 22 బంతుల్లో 61 పరుగులు చేశాడు. లక్ష్య చేధనకు దిగిన దక్షిణాఫ్రికా అందర్నీ ఆకట్టుకుంది. కొండంత స్కోర్ ఉన్నా..ఆదిలో వికెట్లు కోల్పోయినా లక్ష్యం వైపు కదిలింది.


మిల్లర్ 47 బంతుల్లో 106 పరుగులు చేయగా.. డికాక్ 48 బంతుల్లో 69 పరుగులు చేశారు. ఇందులో మొదటి పది ఓవర్లు భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆ తర్వాత 10 ఓవర్లలో దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు. దీపక్ చాహర్ మినహా మిగతా బౌలర్లంతా భారీగా పరుగులు ఇచ్చారు. తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన అర్ష్‌దీప్‌ 4 ఓవర్లలో 62 పరుగులు ఇచ్చాడు. ఇందులో మూడు నోబాల్స్, రెండువైడ్లు ఉన్నాయి. ప్రపంచకప్‌ ముందు భారత్‌ను ఈఅంశం కలవరపెడుతోంది.


Also read:ఛానల్ పై ఓపెన్ కామెంట్స్.. అడుక్కుతింటున్నారా? అంటూ అంటూ ఘాటు కౌంటర్!


Also read:Munugode Bypoll: మునుగోడు బైపోల్ డేట్ వచ్చింది.. మోడీ  హైదరాబాద్ టూర్ ఖరారైంది.. బీజేపీ స్కెచ్ మాములుగా లేదుగా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook