Cricketers and Divorce Women: విడాకులు తీసుకున్న మహిళల్ని పెళ్లి చేసుకున్న క్రికెటర్లు ఎవరో తెలుసా
Cricketers and Divorce Women: భారతీయ క్రికెటర్లలో డైవర్స్ మహిళల్నిపెళ్లి చేసుకున్నవాళ్లెవరైనా ఉన్నారా అంటే వెంటనే అవుననే సమాధానం వస్తుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు..ఏకంగా ఐదుగురున్నారు. ఆ క్రికెటర్లెవరో చూసేద్దామా..
Cricketers and Divorce Women: భారతీయ క్రికెటర్లలో డైవర్స్ మహిళల్నిపెళ్లి చేసుకున్నవాళ్లెవరైనా ఉన్నారా అంటే వెంటనే అవుననే సమాధానం వస్తుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు..ఏకంగా ఐదుగురున్నారు. ఆ క్రికెటర్లెవరో చూసేద్దామా..
విడాకులు తీసుకున్న మహిళల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న క్రికెటర్లు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. టీమ్ ఇండియాలో కూడా అటువంటి క్రికెటర్లు ఉన్నారు. సమాజం ఏమనుకుంటుందనేది పట్టించుకోకుండా డైవర్స్ మహిళల ప్రేమలో పడి పెళ్లిచేసుకున్నారు. ఆ జాబితాలో ఐదుగురు భారతీయ క్రికెటర్లున్నారు. ఆ ఐదుగురు క్రికెటర్లు ఎవరో చూద్దాం..
శిఖర్ ధావన్
శిఖర్ ధావన్ 2012లో ఆయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్నాడు. ఆయేషా..మెల్బోర్న్‌లో నివాసముండే బ్రిటీషు బెంగాలీ మహిళ. ఆయేషా మొదటి పెళ్లి అనంతరం విడాకులు తీసుకుంది. మొదటి భర్తతో ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఆయేషా శిఖర్ ధావన్ కంటే పదేళ్లు పెద్దది కూడా. ఆశ్చర్యమేమంటే గత ఏడాది శిఖర్ ధావన్, ఆయేషాల విడాకులు కూడా అయిపోయాయి.
అనిల్ కుంబ్లే
దిగ్గజ భారతీయ క్రికెటర్, స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లే భార్య కూడా డైవర్సీనే. చేతన అనే ఈ మహిళను అనిల్ కుంబ్లే 1999లో పెళ్లి చేసుకున్నాడు. అప్పట్నించి ఈ ఇద్దరూ ఆనందంగా కలిసి ఉన్నారు.
మొహమ్మద్ షమీ
ఈ జాబితాలో టీమ్ ఇండియా పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ కూడా ఉన్నాడు. షమీ 2014లో హసీన్ జహాను పెళ్లి చేసుకున్నాడు. ఈమధ్యన ఈ ఇద్దరికి సరిపడటం లేదు. ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. హసీనా మొదటి భర్తతో విడాకులు తీసుకుంది.
మురళీ విజయ్
టీమ్ ఇండియా ఓపెనర్ మురళీ విజయ్ పెళ్లి నికితా వంజారాతో జరిగింది. నికితా ఎవరో కాదు. టీమ్ ఇండియా మరో క్రికెటర్ దినేష్ కార్తీక్ మొదటి భార్య. తరువాత ఈ ఇద్దరికీ విడాకులయ్యాయి. తరువాత నికితా..విజయ్‌తో పెళ్లి చేసుకుంది. ఈ విషయంపై ఈ ఇద్దరు క్రికెటర్లను చాలామంది సరదా పట్టించారు కూడా.
వెంకటేశ్ ప్రసాద్
టీమ్ ఇండియా మాజీ పేస్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా ఓ డైవర్సీ మహిళనే పెళ్లి చేసుకున్నాడు. 1996లో వెంకటేశ్ ప్రసాద్..జయంతి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భర్తతో విడాకులైంది. ఈ ఇద్దరికీ పరిచయం చేసింది అనిల్ కుంబ్లే కావడం విశేషం.
Also read: Ranji Trophy 2021-22: రంజీ ట్రోఫీని ముద్దాడిన మధ్యప్రదేశ్..ఆటగాళ్ల భావోద్వేగం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి