Ravi Shastri: టీమ్ ఇండియా..దక్షిణాఫ్రికా పర్యటనలో ఘోరంగా విఫలమైంది. అటు టెస్ట్ సిరీస్ ఇటు వన్డే సిరీస్ రెండింటినీ కోల్పోయింది. ఈ నేపధ్యంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా పర్యటన ముగిసింది. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అన్ని ఫార్మట్ల సారధ్యం నుంచి తప్పుకున్నాడిప్పుడు. టీమ్ ఇండియా దక్షిణాఫ్రికాతో టెస్ట్, వన్డే రెండు సిరీస్‌లలో పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా పర్యటన కంటే ముందే బీసీసీఐ..విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించి రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించింది. రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమవడంతో..కేఎల్ రాహుల్‌కు బాధ్యతలు అప్పగించారు. కెప్టెన్ ట్యాగ్ లేకుండా తొలిసారి వన్డే సిరీస్ ఆడిన కోహ్లి..వరుసగా మూడు మ్యాచ్ లలో 79, 0, 65 పరుగులు సాధించాడు. ఈ నేపధ్యంలో రవిశాస్త్రి ..విరాట్ కోహ్లి (Virat Kohli)గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 


కెప్టెన్సీ నుంచి వైదొలగడం అతని నిర్ణయమని..ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సి ఉందన్నాడు రవిశాస్త్రి (Ravishastri). కెప్టెన్సీ ఉన్నా లేకపోయినా..కోహ్లీ ఆటతీరులో పెద్ద తేడా ఉండదని రవిశాస్త్రి చెప్పాడు. దక్షిణాఫ్రికా చేతిలో ఇండియా పరాజయం పాలయినంత మాత్రాన ఐదేళ్లుగా నెంబర్ 1 గా ఉన్న టీమ్..ఒక్కసారిగా పడిపోయిందని చెప్పడం మంచిది కాదన్నాడు. ప్రతి విషయానికి కాలమే సమాధానం చెబుతుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. గతంలో కూడా చాలా మంది క్రికెటర్లు..కెప్టెన్సీ వదులుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సచిన్ టెండూల్కర్, గవాస్కర్, ధోని ఇలా ఎవరైనా సరే ఒక్కో సందర్భం వచ్చినప్పుడు కెప్టెన్సీ బాధ్యతల్నించి తప్పుకున్నారని చెప్పాడు. వాస్తవానికి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా చూడలేదన్నాడు.


Also read: Gautam Gambhir Corona: గౌతమ్ గంభీర్‌కు కరోనా.. ట్విట్టర్ వేదికగా వెల్లడి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


 మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook