Ishant Sharma: టీమ్ ఇండియా మాజీ రధసారధి విరాట్ కోహ్లీ గురించి సహచర క్రికెటర్ ఇషాంత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయం ఎలా గడిపాడనేది వివరించాడు. ఇషాంత్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమౌతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెద్దది. గ్రౌండ్‌లో దిగితే చాలా దూకుడుగా ఉండటం అలవాటు. ఐపీఎల్ మ్యాచ్ అయినా, వన్డే క్రికెట్ అయినా, టీ20 అయినా టెస్ట్ మ్యాచ్ అయినా విరాట్ కోహ్లీ శైలి ఎప్పటికీ మారదు. అదే స్టైల్, అదే ఆట తీరు, అదే వ్యవహారశైలి. విరాట్ కోహ్లీ జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి అతడి సహచరుడు, ఢిల్లీ వాస్తవ్యుడు ఇషాంత్ శర్మ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఏడాది కాలంగా అద్భుత ఫామ్ ప్రదర్శిస్తున్న విరాట్ కోహ్లీ కెరీర్‌లో అంతకుముందు మూడేళ్లు దుర్భరంగా గడిచాయని చెప్పాలి. మూడేళ్లలో విరాట్ కోహ్లి ఒక్క సెంచరీ కూడా సాధించలేదంటే ఎంతగా ఫామ్ కోల్పోయాడో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకంటే దురదృష్ఠకరమైన ఘటనలు విరాట్ కోహ్లీ జీవితంలో ఎదురైనవాటి గురించి అతనికి అత్యంత సన్నిహితుడైన తోటి క్రికెటర్ ఇషాంత్ శర్మ కొన్ని విషయాలు ఓ యూట్యూబ్ ఛానెల్‌తో పంచుకున్నాడు.


కోహ్లీ గురించి ఇషాంత్ శర్మ ఏం చెప్పాడంటే


2006 డిసెంబర్ 18 విరాట్ కోహ్లి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజని ఇషాంత్ శర్మ తెలిపాడు. ఆ రోజు ఢిలీ జట్టు తరపున కర్ణాటకతో రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు విరాట్ కోహ్లి. తండ్రి ప్రేమ్ కోహ్లి గుండెపోటుతో మరణించాడని సమాచారం అందింది. తండ్రి మరణవార్తను గుండెలోనే దిగమింగుకుని 90 పరుగులు చేసి జట్టును ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. మ్యాచ్ తరువాత తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. కోహ్లీకు ఆటపై ఎంత నిబద్ధత ఉందో చెప్పేందుకు ఈ ఒక్క ఘటన చాలని ఇషాంత్ శర్మ వివరించాడు. తండ్రి మరణవార్త విన్న కోహ్లీ ఒక్కసారిగా ఉదాసీనమయ్యాడని, ఒంటరిగానే ఓ పక్కకు వెళ్లి బాధపడ్డాడని ఇషాంత్ శర్మ వివరించాడు. ఆ రోజు అంతటి దుఖాన్ని కోహ్లీ ఎలా తట్టుకుని ఆడాడో నాకిప్పటికి కూడా అర్ధం కాలేదన్నాడు. ఎందుకంటే ఆ సమయంలో కోహ్లీ వయస్సు కేవలం 17 ఏళ్లే. అదే తనకు అలా జరిగుంటే తట్టుకోలేకపోయేవాడినన్నాడు. 


విరాట్ కోహ్లీ కెరీర్‌లో మంచి, చెడు రెండింటినీ చూశానన్నాడు ఇషాంత్ శర్మ. పార్టీ నుంచి టేటూ వరకూ, ఫిట్నెస్ ఫ్రీక్ నుంచి టాప్ పర్ఫార్మర్‌గా, క్రికెట్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నాడు కోహ్లీ. కోహ్లీకు పార్టీలంటే చాలా ఇష్టం. కోల్‌కతాలో ఓ టోర్నమెంట్ సందర్భంగా రాత్రంతా పార్టీలో గడిపినా మరుసటి రోజు 250 పరుగులు జోడించాడు. అతడి విషయంలో ఆట ఆటే..పార్టీ పార్టేనని ఇషాంత్ శర్మ వివరించాడు. 


Also read: Virender Sehwag Tweet: ఆదిపురుష్‌ మూవీపై వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్స్.. వైరలవుతున్న ట్వీట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook