MS Dhoni With Amit Shah: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. అతని పేరు సోషల్ మీడియాలో మార్మోమోగిపోతోంది. ఇటీవల ఇంగ్లండ్ చేతిలో సెమీ ఫైనల్లో టీమిండియా ఓడిపోయిన తరువాత ధోనిని అందరూ గుర్తు చేసుకున్నారు. ధోని ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లమని నెటిజన్లు అంటున్నారు. We Miss You Dhoni అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎంఎస్ ధోని మాట్లాడుతున్న ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా అవుతోంది. దీనిపై రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. ధోని రాజకీయాల్లోకి వస్తున్నాడా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అమిత్‌ షాతో ధోని సరదాగా మాట్లాడాడు. మెడలో ఐడీ కార్డు ధరించిన ధోని.. టక్ వేసుకుని స్టైలిష్‌ కనిపించాడు. 


 



అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు గుడ్‌ బై చెప్పిన ధోనీ.. ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. తన టీమ్‌ను వచ్చే ఏడాది కూడా కెప్టెన్‌గా ముందుండి నడిపించనున్నాడు. గత సీజన్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు అప్పగించాడు. అయితే జడేజా కెప్టెన్‌గా ఆటగాడిగా ఘోరంగా విఫలం కావడంతో కెప్టెన్సీగా గుడ్ బై చెప్పాడు. దీంతో మళ్లీ ధోనినే పగ్గాలు చేపట్టాడు. 


2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే ప్రపంచకప్‌, 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని ధోని కెప్టెన్సీలోనే టీమిండియా గెలుచుకుంది. ధోని తన కెరీర్‌లో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 17 వేలకు పైగా పరుగులు చేశాడు. కెప్టెన్‌గా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న ఏకైక క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. 


Also Read: Bansuwada Woman Death: ఫేస్‌బుక్‌లో యువకుడితో ప్రేమ.. భర్తను వదిలి వెళ్లిపోయిన మహిళ.. ఊహించని షాక్  


Also Read: Dallas Airshow: డల్లాస్ ఎయిర్‌ షోలో విషాదం.. ఆకాశంలో ఢీకొన్న రెండు విమానాలు.. వీడియో వైరల్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి