LLC 2022: లెజెండ్స్ లీగ్ క్రికెట్‌కు అంతా రెడీ..బ్యాట్ పట్టనున్న మాజీ స్టార్ ప్లేయర్..!
LLC 2022: లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో సీజన్‌కు సర్వం సిద్ధమవుతోంది. త్వరలో సీజన్ అలరించనుంది. తాజాగా క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది.
LLC 2022: ఈసారి జరిగే లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో భారత దిగ్గజ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించారు. మళ్లీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్నానని..మైదానంలో అడుగు పెట్టేందుకు ఎదురు చూస్తున్నానని తెలిపాడు. లెజెండ్ లీగ్ క్రికెట్‌లో దిగ్గజ ఆటగాళ్లతో కలిసి ఆడటం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఐతే మొదట ప్రకటించిన భారత లెజెండ్స్ టీమ్‌లో గౌతమ్ పేరు లేదు.
త్వరలో ప్రకటించే అధికారిక టీమ్‌లో అతడు చేరనున్నాడు. వచ్చే నెల 17 నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈటోర్నీలో మొత్తం ఆరు జట్లు ఆడనున్నాయి. తొలి మ్యాచ్‌ను వైభవంగా నిర్వహించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సెప్టెంబర్ 16న ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇండియా టీమ్‌కు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
వరల్డ్ జెయింట్స్‌ను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నడిపించనున్నాడు. టీమిండియా జట్టుకు గౌతమ్ గంభీర్ ఓపెనర్‌గా, మిడిల్ ఆర్డర్ ఆటగాడిగా సేవలు అందించాడు. సచిన్, సెహ్వాగ్ వంటి దిగ్గజాలతో కలిసి ఓపెనర్ బ్యాటర్స్‌మెన్ సేవలు అందించాడు. ఐతే 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు గంభీర్ గుడ్‌బై చెప్పాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్‌ను భారత్ కైవసం చేసుకోవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు.
భారత్ తరపున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20ల్లో గంభీర్ ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 10 వేల 324 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ విశేషంగా రాణించాడు. గౌతమ్ గంభీర్ నాయకత్వంలోనే కోల్‌కతా నైట్ నైడర్స్ 2012, 2014 ఐపీఎల్ టైటిల్‌ను సాధించింది. మళ్లీ అతడు బ్యాట్ పట్టడంపై క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత గంభీర్ ఆటను చూడగల్గుతామని అంటున్నారు.
[[{"fid":"242048","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాయు'గండం'..మూడురోజులపాటు భారీ వర్ష సూచన..!
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook